లిక్కర్ స్కామ్ కేసులో ఆసక్తికర పరిణామాలు.. సుప్రింకోర్టుకు కవిత.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అరుణ్ పిళ్లై..

తెలంగాణలో మరోసారి ఈడీ వేడి రాజుకుంది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నోటీసులిచ్చింది. ఇవాళే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మరి, కవిత ఈడీ ముందు హాజరవుతారా? లేదా?. ఇవాళ కాకపోతే ఎప్పుడు హాజరవుతారు?. అసలు వెళ్తారా? లేదా? అన్నది ఇప్పుడు హాట్ డిస్కర్షన్‌గా మారింది. ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేయడంపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంతో ఇవాళ జరుగనున్న ఈడీ విచారణకు..

లిక్కర్ స్కామ్ కేసులో ఆసక్తికర పరిణామాలు.. సుప్రింకోర్టుకు కవిత.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అరుణ్ పిళ్లై..
K Kavitha

Updated on: Sep 15, 2023 | 8:00 AM

తెలంగాణలో మరోసారి ఈడీ వేడి రాజుకుంది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నోటీసులిచ్చింది. ఇవాళే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మరి, కవిత ఈడీ ముందు హాజరవుతారా? లేదా?. ఇవాళ కాకపోతే ఎప్పుడు హాజరవుతారు?. అసలు వెళ్తారా? లేదా? అన్నది ఇప్పుడు హాట్ డిస్కర్షన్‌గా మారింది. ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేయడంపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంతో ఇవాళ జరుగనున్న ఈడీ విచారణకు హాజరుకాబోనని తేల్చి చెప్పారు. మరి నోటి మాటల అనడం వేరు, లీగల్‌గా ప్రోసీడ్ అవడం వేరు కావున.. ఈ విషయంలో ఆమె ఏ స్టెప్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టులో కవిత సవాల్..

మరోవైపు ఈడీ నోటీసులను సుప్రీంకోర్టులో సవాలు చేశారు కల్వకుంట్ల కవిత. కేసు పెండింగ్‌లో ఉండగా నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ లో ఇంటర్ లోకేటరీ అప్లికేషన్ ఫైల్ చేశారు కవిత. దీంతో ఆ పిటిషన్ నేడు విచారణకు విచారణకు రానుంది. కవిత పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు దులియా, జస్టిస్ అరవింద్ కుమార్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. కవిత తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే ఈడీ నోటీసులపై న్యాయ సలహా తీసుకున్న కవిత… తన న్యాయవాదుల్ని ఢిల్లీకి పంపారు.

బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అరుణ్ పిళ్లై..

ఇక ఈడీకి ధీటుగా కవిత అడుగులు వేస్తుంటే, అదే టైమ్‌లో సూపర్‌ ట్విస్ట్‌ ఇచ్చారు అరుణ్‌ పిళ్లై. దాంతో ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మరో మలుపు తీసుకుంది. ఇప్పటి వరకూ అప్రూవర్‌గా మారారంటూ చెబుతున్న అరుణ్ పిళ్లై తాజా కామెంట్స్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తాను అప్రూవర్‌గా మారలేదంటూ అరుణ్‌ పిళ్లై లేటెస్ట్‌ స్టేట్మెంట్ ఇచ్చారు. అప్రూవర్‌గా మారారన్న వార్తలను పిళ్లై తరపు లాయర్లు ఖండించారు. సెక్షన్‌ 164 కింద పిళ్లై ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పారు అరుణ్‌ పిళ్లై లాయర్లు. దాంతో ఈ కేసు మరో కీలక టర్న్ తీసుకున్నట్లయ్యింది.

కవితకు ఈడీ నోటీసులపై బండి సంజయ్ కామెంట్స్..

అటు కవితకు ఈడీ నోటీసులపై ఎంపీ బండిసంజయ్‌ స్పందించారు. ఈడీ నోటీసులకు బీజేపీకి ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు బండి. తప్పు చేస్తే విచారించే అధికారం ఈడీకి ఉందన్నారు. మోదీ చరిష్మా ముందు కేసీఆర్‌ దిగదుడుపేనన్నారు బండి సంజయ్. అయితే మరోసారి కవిత మాత్రమే ఇప్పుడు విచారణకు పిలవడంతో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..