కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు… మూడో రౌండ్‌లో స్వల్ప అధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి

|

Mar 18, 2021 | 7:30 PM

మహబూబ్‌నగర్‌ -హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మూడో రౌండ్ లెక్కింపు ముగిసే సమయానికి టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది.

కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు... మూడో రౌండ్‌లో స్వల్ప అధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి
Follow us on

Telangana Graduate MLC elections Results 2021 : మహబూబ్‌నగర్‌ -హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మూడో రౌండ్ లెక్కింపు ముగిసే సమయానికి టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది.టీఆర్ఎస్ అభ్యర్థి సుర‌భి వాణిదేవి 1,831 ఓట్ల ఆధిక్యం ప్రద‌ర్శిస్తున్నారు. మూడో రౌండ్‌లో వాణిదేవికి 17,636 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఇప్పటివ‌ర‌కు ఆమెకు మొత్తం 53,007 ఓట్లు ల‌భించాయి. ఇంత‌కుముందు రెండో రౌండ్‌ ముగిసే వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రామచందర్‌రావుపై 2,613 ఓట్లతో ఆధిక్యం సాధించారు. రెండో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 17,732, బీజేపీకి 16,173, నాగేశ్వర్‌ 8,594, కాంగ్రెస్‌కు 4,980 ఓట్లు పోలయ్యాయి. అలాగే ఈ రౌండ్‌లోనూ మొత్తం పోలైన ఓట్లలో 3,375 ఓట్లు చెల్లకుండాపోయాయి. రెండు రౌండ్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి 35,171 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 32,558 ఓట్లు వచ్చాయి.

Read Also…. తెలంగాణపై గురిపెట్టిన జనసేనాని.. ఉమ్మడి నల్గొండ జనసేన జిల్లా కమిటీని ప్రకటించిన పవన్ కళ్యాణ్