Raghunandan Rao: మీ నిర్ణయాల వల్ల జాతీయ జెండాకు అవమానం.. రాజ్యాంగ సూక్తులకు భిన్నంగా కేసీఆర్ పరిపాలన..

|

Jan 26, 2023 | 11:46 AM

గవర్నర్‌ను, బీజేపీని వ్యతిరేకిస్తున్నామనుకునే మీ నిర్ణయాల వల్ల జాతీయ జెండాకు అవమానం జరుగుతోందని మండిపడ్డారు. గవర్నర్ జాతీయ జెండాను ఎగువేస్తేనే కరోనా ప్రభలుతుందనుకోవడం ఓర్వలేని గుణం..

Raghunandan Rao: మీ నిర్ణయాల వల్ల జాతీయ జెండాకు అవమానం.. రాజ్యాంగ సూక్తులకు భిన్నంగా కేసీఆర్ పరిపాలన..
Raghunandan
Follow us on

గణతంత్ర దినోత్సవం రోజున కూడా రాజ్యాంగ సూక్తులకు భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పరిపాలన చేయడం బాధాకరమన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. గవర్నర్‌ను, బీజేపీని వ్యతిరేకిస్తున్నామనుకునే మీ నిర్ణయాల వల్ల జాతీయ జెండాకు అవమానం జరుగుతోందని మండిపడ్డారు. గవర్నర్ జాతీయ జెండాను ఎగువేస్తేనే కరోనా ప్రభలుతుందనుకోవడం ఓర్వలేని గుణం మాత్రమేనని ఆరోపించారు. సర్వోన్నత న్యాయ స్థానం పెరేడ్ గ్రౌండ్ లో జెండా వేడుకలు నిర్వహించిలనే మాటను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కడం బాధాకరమన్నారు.

జిల్లాలల్లో జెండా కార్యక్రమాలను రద్దు చేయుమని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? హైదరాబాద్‌లో గవర్నర్‌తో జెండా వేడుకలు జరపవద్దనే జిల్లాల్లో కూడా  రద్దు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇంతగా రాజకీయాలను దిగజార్చడం బాధాకరం.. ఈ అవమానం జాతీయ జెండాకు చేసినట్టే అని అన్నారు.

ఖమ్మంలో బహిరంగ సభ పెడితే కరోనా పాండమిక్ ఉండదా? రేపు మీ పుట్టిన రోజు సందర్భంగా సచివాలయం ప్రారంభిస్తామనుకుంటే కరోనా ప్రభలదా? సచివాలయం ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వహించబోయే సభలో కరోనా ప్రభలదా? అంటూ నిలదీశారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ముఖ్యమంత్రి కి హెచ్చరించారు. గణతంత్ర దినోత్సవం రోజున రాజకీయం చేయడం తగదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మనసు మార్చుకుని రాజకీయాలను దిగజార్చకుండా ఉండండాలని కోరారు.

రఘునందన్ రావు లైవ్ వీడియోను ఇక్కడ చూడండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం