Palla Rajeshwar Reddy: కేసీఆర్‌ నివాసంలో జారిపడిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. హాస్పిటల్‌కు తరలింపు !

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గాయపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్‌ ను కలిసేందుకు ఆయన నివాసమైన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడ ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయారు. దీంతో ఆయన తుంటి ఎముకకు గాయమైనట్లు తెలుస్తోంది. వెంటనే కార్యకర్తలు ఆయన్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.

Palla Rajeshwar Reddy: కేసీఆర్‌ నివాసంలో జారిపడిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. హాస్పిటల్‌కు తరలింపు !
Palla

Updated on: Jun 11, 2025 | 10:35 AM

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గాయపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఆయన నివాసమైన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్ రెడ్డి అక్కడ ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయారు. గత బీఆర్ఎస్ హాయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగడంతో నిర్మాణలోపాలు ఉన్నాయన్న ఆరోపణలతో మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ కేసీఆర్‌ కాళేశ్వరం కమిషన్‌ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఆయన్ను కలిసేందుకు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలు, కార్యకర్తలు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకుంటున్నారు.

అయితే కేసీఆర్‌ను కలిసేందుకు అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తు ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయారు. దీంతో ఆయన తుంటి ఎముకకు గాయమైనట్లు తెలుస్తోంది. వెంటనే కార్యకర్తలు ఆయన్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.

మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు మాజీ సీఎం కేసీఆర్ బీఆర్కే భవన్‌కు బయల్దేరారు. కేసీఆర్‌తో పాటు వేళ్లేందుకు 9 మంది నేతలకు అనుమతి ఇచ్చారు. దీంతో కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, పద్మారావుగౌడ్‌, మహమూద్‌ అలీ, రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఆర్కే భవన్‌కు బయల్దేరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..