కేంద్రం నిధులు ఇవ్వకున్నా మిషన్‌ భగీరథ సక్సెస్‌ చేశాం.. కేంద్ర జలజీవన్‌ కన్నా.. మిషన్‌ భగీరథే బెస్ట్‌

|

Jan 21, 2021 | 8:54 AM

కేంద్ర ప్రభుత్వ జలజీవన్‌ మిషన్‌ కంటే.. తెలంగాణ మిషన్‌ భగీరథ నీరే బెస్ట్‌ అని తెలంగాణ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ..

కేంద్రం నిధులు ఇవ్వకున్నా మిషన్‌ భగీరథ సక్సెస్‌ చేశాం.. కేంద్ర జలజీవన్‌ కన్నా.. మిషన్‌ భగీరథే బెస్ట్‌
Follow us on

కేంద్ర ప్రభుత్వ జలజీవన్‌ మిషన్‌ కంటే.. తెలంగాణ మిషన్‌ భగీరథ నీరే బెస్ట్‌ అని తెలంగాణ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్ట్‌ కోసం కేంద్రం నిధులు ఇవ్వకపోయినా నిరాశ పడలేదన్నారు.

తెలంగాణలోని అన్ని గ్రామాలకు మిషన్‌ భగీరధ నీళ్లు అందుతున్నాయని మంత్రి తెలిపారు. అందుకు రేయింబవళ్లు కృషి చేసిన అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు 27,500 గ్రామాల్లో దాదాపు 56లక్షల ఇళ్లకు మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.

మిషన్‌ భగీరథ వాటర్‌ మంచినీరు కాదని కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీరు కాకపోతే అవార్డులు ఎలా వస్తాయని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ప్రజల దాహార్తిని తీరుస్తున్న మిషన్‌ భగీరథపై ఇప్పటికైనా దుష్ప్రచారం ఆపాలని మంత్రి కోరారు.