Talasani Srinivas Yadav: మల్లన్న స్వరూపం సీఎం కేసీఆర్‌.. మంత్రి తలసాని పొగడ్తల వర్షం..

తెలంగాణ సీఎం కేసీఆర్ యాదవుల ఆరాధ్యదైవం కొమురవెల్లి మల్లన్న స్వరూపం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. యాదవుల అభివృద్ధి కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు.

Talasani Srinivas Yadav: మల్లన్న స్వరూపం సీఎం కేసీఆర్‌.. మంత్రి తలసాని పొగడ్తల వర్షం..
Talasani Srinivas Yadav, Cm KCR

Updated on: Mar 06, 2023 | 7:30 AM

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో ప్రయాణిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ యాదవుల ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లన్న స్వరూపం అని మంత్రి అన్నారు. సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు.

యాదవుల కులవృత్తి గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించే విధంగా సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 11 వేలకోట్ల వ్యయంతో 75 శాతం సబ్సిడీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొమురవెల్లి మల్లన్న ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రజల బాగోగులు పట్టించుకునే ప్రభుత్వానికి అండగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్ నగరానికే పరిమితమైన సదర్‌ను రాష్ట్ర పండుగగా తమ ప్రభుత్వం నిర్వహిస్తుందని తలసాని అన్నారు. యాదవులు నీతి నిజాయితికి మారుపేరని ముఖ్యమంత్రి అనేక సార్లు అసెంబ్లీలో ప్రకటించారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, షీప్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us