Watch Video: ‘ఉచిత బస్సులో ఎల్లిపాయ పొట్టు తీయడం తప్పా?’.. మంత్రి సీతక్క

|

Aug 15, 2024 | 12:09 PM

బస్సుల్లో మహిళలు ఎల్లిపాయ, అల్లం పొట్టు తీయడం తప్పెలా అవుతుందంటూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖల మంత్రి సీతక్క ప్రశ్నించారు. అల్లం ఎల్లిపాయ తీస్తే అదేమైనా తప్పా? ఖాళీగా కూర్చుని టైం వేస్ట్ చేయడం ఎందుకని బస్సులో ఎల్లిపాయ వలుచుకున్నారేమో? దీన్ని కూడా వీడియో తీసి తప్పుగా చూపించిండ్రు. అదేవిధంగా అల్లికలు చేసుకుంటారు. మహిళలకు ఒకప్పుడు కుట్లు అల్లికలు..

Watch Video: ఉచిత బస్సులో ఎల్లిపాయ పొట్టు తీయడం తప్పా?.. మంత్రి సీతక్క
Minister Sitakka
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 15: బస్సుల్లో మహిళలు ఎల్లిపాయ, అల్లం పొట్టు తీయడం తప్పెలా అవుతుందంటూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖల మంత్రి సీతక్క ప్రశ్నించారు. అల్లం ఎల్లిపాయ తీస్తే అదేమైనా తప్పా? ఖాళీగా కూర్చుని టైం వేస్ట్ చేయడం ఎందుకని బస్సులో ఎల్లిపాయ వలుచుకున్నారేమో? దీన్ని కూడా వీడియో తీసి తప్పుగా చూపించిండ్రు. అదేవిధంగా అల్లికలు చేసుకుంటారు. మహిళలకు ఒకప్పుడు కుట్లు అల్లికలు ఇవన్నీ మహిళలకు జీవనాధారం. అదిలాబాద్‌ నుంచి రావాలంటే 4 -5 గంటల జర్నీ. ఆమె ఇంటి దగ్గర ఉంటే ఆ పని చేసుకునేది. ఖాళీగా ఉండటం ఎందుకని బస్సులో రెండు పనులు అయితయని ఎల్లిపాయ ఒలుచుకుందేమో. వీటన్నింటినీ చూపించి.. అసలు మహిళలకు ఉచిత ప్రయాణమే వృద్ధా అని చెప్పడం కరెక్ట్‌ కాదని అన్నారు.

మహిళలు తమ ప్రయాణ సమయాన్ని వృథా చేసుకోకుండా ఓ వైపు బస్సులో ప్రయాణిస్తూనే తమ పనులు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఉచిత బస్సులో కూరగాయలు అమ్ముకున్నా తప్పేమీ లేదని మంత్రి సీతక్క అన్నారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో బుధవారం జరిగిన స్త్రీనిధి క్రెడిట్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ 11వ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతక్క ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఉచిత ప్రయాణాన్ని అవహేళన చేస్తూ కొందరు వీడియోలు చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్టు చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఇలాంటి రూపొందించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా సాధికారతను తట్టుకోలేకే ఆ పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. మహిళలకు చేయూతనిస్తుంటే ఎందుకంత అక్కసు వెళ్లగక్కుతున్నారని ప్రశ్నించారు. సచివాలయంలో ప్రారంభమైన మహిళా శక్తి క్యాంటీన్లను అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నట్టు’ ఈ సందర్భంగా తెలియజేశారు.

 

ఇవి కూడా చదవండి

ఎన్‌కౌంటర్లతో సమాజంలో మార్పురాదని అన్నారు. వరంగల్‌, దిశ ఎన్‌కౌంటర్లతో సమాజం ఏం మారలేదని, మహిళలపై వేధింపులు దాడులు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశామంటూ అసత్య ఆరోపణలు చేయడం బీఆర్‌ఎస్‌ నేతలకు తగదని మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీలకు నిధుల్లేక పాలన పడకేసిందంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ట్వీట్లపై ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.