Adilabad: 6 గ్యారంటీల అమలుకు అధికారులు సమష్టిగా పని చేయాలని కోరిన సీతక్క..

|

Dec 27, 2023 | 9:08 PM

డిసెంబర్‌ ప్రజా పాలన కార్యక్రమానికి అన్ని చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కఅధికారులను ఆదేశించారు. దరఖాస్తుదారులు ఇబ్బందులు పడకుండా గ్రామాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజా పాలనపై ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధికారుల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తుందని పేర్కొన్నారు.

Adilabad: 6 గ్యారంటీల అమలుకు అధికారులు సమష్టిగా పని చేయాలని కోరిన సీతక్క..
Seethakka
Follow us on

ఆదిలాబాద్, డిసెంబర్‌27; జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలనీ, ప్రజా పాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర మంత్రి సీతక్క సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజా పాలనపై బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె సమీక్ష నిర్వహించారు. ముందుగా పోలిసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు వినోద్, వెడ్మ బొజ్జు, రేఖానాయక్, అదనపు కలెక్టర్లు శ్యామల దేవి, ఖుష్బు గుప్తాలతో కలిసి శాఖల వారీగా సమీక్షించారు. అంతకుముందు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు మంత్రిని కలిసి శాలువతో సత్కరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ… ఆదిలాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేలా కృషి చేయాలనీ సూచించారు. ఈనెల 28 నుండి జనవరి ఆరవ తేది వరకు నిర్వహించనున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలనీ ఆదేశించారు. అందుకోసం బుధవారం సాయంత్రం నుండే దరఖాస్తు ఫారాలను అందించానున్నారని, వాటిని పూరించి గ్రామసభలో అధికారులకు అందించాల్సి ఉంటుందని వివరించారు. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా లబ్దిదారుల ఎంపికకు గానూ ప్రజా పాలన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించడానికి ఒకరోజు ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ముందుకు రావాలని సీతక్క కోరారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీలకు సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి వలసలను నియంత్రించడం, ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం కాకుండా అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమించడం జరుగుతుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

డిసెంబర్‌ ప్రజా పాలన కార్యక్రమానికి అన్ని చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కఅధికారులను ఆదేశించారు. దరఖాస్తుదారులు ఇబ్బందులు పడకుండా గ్రామాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజా పాలనపై ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధికారుల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..