House Arrest: మంత్రి సత్యవతి రాథోడ్‌ సహా ప్రజాప్రతినిధులను గృహ నిర్బంధం చేసిన పోలీసులు..!

|

Jan 05, 2021 | 2:08 PM

House Arrest: తెలంగాణ గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సహా పలువురు ప్రజాప్రతినిధులను..

House Arrest: మంత్రి సత్యవతి రాథోడ్‌ సహా ప్రజాప్రతినిధులను గృహ నిర్బంధం చేసిన పోలీసులు..!
Follow us on

House Arrest: తెలంగాణ గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సహా పలువురు ప్రజాప్రతినిధులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. వద్దంటే వినకుండా మొండికేస్తుండటంతో పోలీసులు ఈ చర్యకు పూనుకున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలం ఆలుబాకా గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వచ్చారు.

అయితే ఆలుబాకాలో మావోల కదలికలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. మంత్రి సత్యవతి సహా ఇతర ప్రజాప్రతినిధులను వారించారు. అయితే పోలీసుల మాటలను వారి లక్ష్య పెట్టలేదు. తాము ప్రజాప్రతినిధులమని, ఆలుబాకా గ్రామానికి వెళ్లి తీరుతామని మొండికేశారు. దాంతో పోలీసులు.. మంత్రి సత్యవతి సహా ఇతర ప్రజాప్రతినిధులందిరినీ ఎమ్మెల్యే బాలసాని లక్ష్మీనారాయణ ఇంట్లో గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా నేతలకు, పోలీసు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Also read:

Tadipatri Clashes: సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. జేసీ బ్రదర్స్ దీక్షపై చర్చించే అవకాశం..

Alibaba Founder Jack Ma: ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా అదృశ్యం… రెండు నెలలుగా కనపడని వైనం…