Telangana: ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు.. మంత్రి పువ్వాడ షాకింగ్ కామెంట్స్..

Telangana Elections: అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి పువ్వాడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడని ఆయన.. ఎన్నికలపై కీలక కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్ విని పార్టీ శ్రేణులు అవాక్కయ్యారు. పువ్వాడ ఇక ఎమ్మెల్యేగా చేయరా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి పువ్వాడ ఏం కామెంట్స్ చేశారు? కార్యకర్తలు ఎందుకంత ఆశ్చర్యం వ్యక్తం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల కాలం నడుస్తోంది. మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

Telangana: ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు.. మంత్రి పువ్వాడ షాకింగ్ కామెంట్స్..
Puvvada Ajay Kumar

Updated on: Sep 22, 2023 | 6:38 PM

Telangana Elections: అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి పువ్వాడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడని ఆయన.. ఎన్నికలపై కీలక కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్ విని పార్టీ శ్రేణులు అవాక్కయ్యారు. పువ్వాడ ఇక ఎమ్మెల్యేగా చేయరా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి పువ్వాడ ఏం కామెంట్స్ చేశారు? కార్యకర్తలు ఎందుకంత ఆశ్చర్యం వ్యక్తం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల కాలం నడుస్తోంది. మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ వెంటనే పార్లమెంట్‌ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే, ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రధాన పార్టీలన్నీ ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే ఆ మేరకు వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి.

ఈ ఎన్నికల కదనరంగంలో బీఆర్ఎస్ పార్టీ ఓ అడుగు ముందుగానే ఉండగా.. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ మరింత స్పీడ్ పెంచింది. ఇక బీజేపీ కూడా తానేం తక్కువా అంటూ దూసుకొస్తుంది. అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. వారు తమ గెలుపు కోసం తమ తమ నియోజకవర్గాల్లోనే ఉంటూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పువ్వాడ అజయ్.. ఖమ్మం నియోజకవర్గం పరిధిలో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ కార్యకర్తలు, ప్రజలను కలుస్తున్నారు. ఇవాళ కూడా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన మంత్రి పువ్వాడ.. ఎన్నికలపై కీలక కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికలకే తనకు చివరి ఎన్నికలు కావొచ్చు అంటూ సెంటీమెంట్ డైలాగ్స్ వేశారు. ‘నాకు ఇవే చివరి ఎన్నికలు కావొచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం మహిళా రిజర్వేషన్‌లోకి వెళ్లొచ్చేమో. మహిళా రిజర్వేషన్ అయిఏత మా ఇంట్లో వాళ్లను ఎన్నికల్లో నిలబెట్టను. అందుకే ఇవే నా చివరి ఎన్నికలు అవుతుండొచ్చు’ అని మంత్రి పువ్వాడ అజయ్ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..