ORR: ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఇంటర్ చేంజ్.. ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు పైన మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి రానుంది. నార్సింగి వద్ద రూ.29.50 కోట్ల వ్యయంతో ఈ ఇంటర్ చెంజ్‌ను నిర్మించారు. అయితే శనివారం ఉదయం పది గంటలకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

ORR: ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఇంటర్ చేంజ్.. ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
Orr

Updated on: Jun 30, 2023 | 11:07 PM

హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు పైన మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి రానుంది. నార్సింగి వద్ద రూ.29.50 కోట్ల వ్యయంతో ఈ ఇంటర్ చెంజ్‌ను నిర్మించారు.  శనివారం ఉదయం పది గంటలకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అయితే ఈ నార్సింగి ఇంటర్ చేంజ్ నిర్మాణం వల్ల నార్సింగి, మంచిరేవుల, గండిపేట ప్రాంతాల ప్రయాణికులకు ఓఆర్ఆర్ మీదుగా వారి గమ్యస్థానానికి వెళ్లేందుకు ఎంతో వీలుగా ఉంటుంది. అలాగే లంగర్ హౌస్, శంకర్ పల్లి నుంచి వారికి కూడా ఔటర్ రింగ్ రోడ్డు మీద వెళ్లేందుకు ఎంతో సులువుగా ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..