KTR: తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. భారీ వరదల కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా జనాలు అతలాకుతలం అవుతుంటే 2018 నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ ఇంద ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని కేంద్రంపై మండిపడ్డారు. ప్రధాని మోడీ గారూ.. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. కో-ఆపరేటవ్ ఫెడరలిజం అంటే అర్థం ఇదేనా.? అని కేటీఆర్ ప్రశ్నించారు.
Hon’ble @PMOIndia Is this what “Sabka Saath, Sabka Vikas”& Co-operative federalism means?
Telangana has been reeling under heavy floods but not a single rupee granted under NDRF since 2018!
Neither did you offer relief to 2020 Hyderabad floods nor to 2022 Godavari floods. Why? pic.twitter.com/zcW1HK07vV
— KTR (@KTRTRS) July 19, 2022
2020లో హైదరాబాద్‌లో సంభవించిన వరదలకు కానీ,ఈ ఏడాదిలో గోవవరి వరదలకు సాయం ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 2018 నుంచి 2022 జూలై 12 వరకు ఎన్‌డీఆర్‌ఎఫ్ అందించిన సాయం వివరాలతో కేంద్రం విడుదల చేసిన జాబితాను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి