నిత్యం ప్రజలతో మమేకమయ్యే మంత్రి కేటీఆర్(Minister KTR) సండేరోజు ట్విటర్‌లో ఆస్క్ కేటీఆర్(Ask KTR) కార్యక్రమం నిర్వహించారు. మంత్రికి ట్వీట్ల వర్షం కురిపించారు నెటిజన్లు. పొలిటికల్, పర్సనల్, స్పోర్ట్స్ అనే తేడా లేకుండా ఎవరికి నచ్చిన విధంగా వారు ట్వీట్ చేశారు. వారి ట్వీట్లకు అంతే కూల్‌గా సమాధానమిచ్చారు మంత్రి. హైదరాబాద్‌లో IPL మ్యాచ్‌లు ఎందుకు నిర్వహించడంలేదన్న ఓ ట్వీట్‌కు మంత్రి ఫన్నీగా ఆన్సర్ చేశారు. ఆ ప్రశ్నకు తనకంటే గంగూలీ, జైషా సమాధానం చెబితే బాగుంటుందంటూ చమత్కరించారు. వైద్యం రంగంపై వచ్చిన ట్వీట్లకు మంత్రి సూటిగా సమాధానమిచ్చారు. వైద్యరంగానికి భారీగా నిధులు కేటాయించామని.. హైదరాబాద్‌లో కొత్తగా మూడు టిమ్స్ ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కర్నాటకలో సీఎం పదవి అమ్మకంపై ఓ ట్విటర్ ప్రశ్నకు మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీ నిజస్వరూపానికి ఇది నిదర్శనమంటూ రీట్వీట్ చేశారు.
తెలంగాణ అంశాలతో పాటు దేశంలో సమకాలీన విషయాలపై నెటిజెన్లు ట్వీట్లతో ముంచెత్తారు. ట్విటర్ ఇండియా ట్రెండింగ్‌లో #AskKTR టాప్‌లో కొనసాగుతోంది. కేటీఆర్‌కు ట్వీట్ చేసినవారిలో సాధారణ ప్రజలతోపాటు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ఉండడం విశేషం. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వ్యూహమేంటని ప్రశ్నించిన వారికి.. ప్రజల ఆశీర్వాదంతో ముందుకుపోతున్నట్లు వెల్లడించారు.
మోదీపై ఎందుకు ఎదురుదాడి చేయలేకపోతున్నారని వచ్చిన ట్వీట్‌కు మంత్రి స్మార్ట్‌గా జవాబిచ్చారు. భవిష్యత్తులో ఏంజరుగబోతుందో ఎవరికి తెలుసంటూ తిరిగి ప్రశ్నించారు. రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుందా అన్న బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా ట్వీట్‌కు.. క్రీడలపై ప్రత్యేకపాలసీ రూపొందిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
Will surely meet her and ensure all needed support is provided https://t.co/rQJfCRBGQd
— KTR (@KTRTRS) May 8, 2022
మరిన్ని రాజకీయ వార్తల కోసం..
ఇవి కూడా చదవండి: Taj Mahal: తాజ్‌మహల్‌లోని ఆ గదులను తెరవండి.. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్..
Kitchen Tips: టేస్టీ టేస్టీ పాస్తా కట్‌లెట్.. మీ ఇంట్లోని చిన్నారులకు అదిరిపోయే టిఫిన్ ఇలా చేయండి..