KTR Interview Highlights: చంద్రబాబు అరెస్ట్ వెనక ఉన్నది వారే.. కేటీఆర్ సంచలన కామెంట్స్

Minister KTR Interview with Rajinikanth Highlights: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోతో మైండ్‌ బ్లాక్‌ అయ్యిందా? ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారా? వరాలతో ఓట్లు పోటెత్తుతాయా? పింక్‌ ప్రామిస్‌ గేమ్‌ ఛేంజర్‌ కాబోతుందా? కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొడతారా? ఇలా మరెన్నో ప్రశ్నలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టీవీ9 క్రాస్‌ ఫైర్‌ ప్రత్యేక ఇంటర్య్వూలో సమాధానం ఇచ్చారు.

KTR Interview  Highlights: చంద్రబాబు అరెస్ట్ వెనక ఉన్నది వారే.. కేటీఆర్ సంచలన కామెంట్స్
Minister KTR Interview with Rajinikanth

Updated on: Oct 15, 2023 | 9:12 PM

Minister KTR Interview with Rajinikanth Highlights: తెలంగాణలో ఎన్నికల ఫీవర్‌ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్‌ కావడంతో అధికార బీఆర్‌ఎస్‌తో పాటు ప్రతి పక్ష కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో తలమునకలయ్యాయి. అయితే ఈ తెలంగాణ దంగల్‌లో కేసీఆర్‌ నేతృత్వంలోని అధికార బీఆర్ఎస్‌ పార్టీ మిగతా పార్టీల కంటే కొంచెం ముందుగా,  అన్నిటికీ మించి దూకుడుగా ఉంటోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీఆర్ఎస్‌ ఇవాళ (అక్టోబర్‌15) మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. మరి ఈ బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోతో మైండ్‌ బ్లాక్‌ అయ్యిందా? ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారా? వరాలతో ఓట్లు పోటెత్తుతాయా? పింక్‌ ప్రామిస్‌ గేమ్‌ ఛేంజర్‌ కాబోతుందా? కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొడతారా? ఇలా మరెన్నో ప్రశ్నలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టీవీ9 క్రాస్‌ ఫైర్‌ ప్రత్యేక ఇంటర్య్వూలో సమాధానం ఇచ్చారు.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Oct 2023 08:42 PM (IST)

    రేవంత్‌ మళ్లీ జైలుకే..

     

    ఈసారి వచ్చేది బీఆర్‌ఎస్సే. మళ్లీ సీఎం కేసీఆరే. ఇదే ప్రజాతీర్పు అన్నారు కేటీఆర్‌. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని కాంగ్రెస్‌ను ప్రజలు ఎలా నమ్ముతారన్నారు. ఓటుకు నోటు కేసులో పీసీసీ చీఫ్‌ దారి ఇక జైలుకేనన్నారు

  • 15 Oct 2023 08:41 PM (IST)

    కమ్యూనిస్టులను వాడుకుని వదిలేశారా?

    మునుగోడులో మాకు మద్దతు ఇచ్చారు. ఇది మేం అంగీకరిస్తాం. అయితే ఈ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేయాలనుకున్నాం. సీట్ల గురించి డిస్కషన్‌ వచ్చింది. అయితే క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను వారి దృష్ఠికి తీసుకొచ్చాం. సీట్లు తగ్గించుకోమన్నాం.. అయితే వారు పక్కకు వెళ్లిపోయారు.


  • 15 Oct 2023 08:38 PM (IST)

    అసంతృప్తి ఉండొచ్చు.. కానీ..

    ఈ ఎన్నికల్లో గెలవడానికి మేం కావాల్సిన ఓటు 51 శాతం. ఇందుకు మాకు కావాల్సిన మెజారిటీ ఉంది. ఎక్కడో కొన్ని చోట్ల అసంతృప్తి ఉండవచ్చు. కేసీఆర్‌ను ప్రజలు మళ్లీ గెలిపిస్తారు.

  • 15 Oct 2023 08:36 PM (IST)

    ఖమ్మంలో బిగ్‌ షాట్స్‌ పోటీపై..

    ఈ దేశంలో ఎన్టీఆర్‌ ఓడిపోయారు. రాహుల్‌ గాంధీ కూడా పరాజయం పాలయ్యారు. ప్రజలు గెలిపిస్తే బిగ్‌ షాట్స్‌ అవుతారు. లేకపోతే మూలకు పోతారు. ఇక్కడ ఎవరూ బిగ్‌ షాట్స్‌ కారు. ఖమ్మంలో కూడా అంతే..

  • 15 Oct 2023 08:30 PM (IST)

    తలతెగినా మోడీ ముందు తలవంచం..

    కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడమే కేసీఆర్‌ లక్ష్యమన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై స్పందించారు కేటీఆర్‌. మోదీ చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. అలాగే బీజేపీపై పోరులో తగ్గేలేదన్నారు. మతం తప్ప మరో ఫిలాసఫీ లేని బీజేపిని వ్యతిరేకిస్తాం. ఎంతదాకైనా పోరాడుతామన్నారు కేటీఆర్‌. తల తెగినా మేం మోడీ ముందు తలవంచమన్నారు

  • 15 Oct 2023 08:27 PM (IST)

    లోకేష్‌ బాధను అర్థం చేసుకోగలను..

    టీడీపీ, చంద్రబాబు పట్ల మేం సానుభూతితో ఉన్నాం. అలాగనీ ఆంధ్రా గొడవలు ఇక్కడకు తీసుకురావొద్దు. అంగీకారం తీసుకుని ధర్నా చౌక్‌లో మీరు ఆందోళనలు చేసుకోండి. మేం అడ్డుచెప్పం. అలాగనీ మెట్రోలో, పబ్లిక్‌ స్థలాల్లో ధర్నాలు చేస్తామంటే సరికాదు.

  • 15 Oct 2023 08:22 PM (IST)

    చంద్రబాబు అరెస్ట్‌ వెనక ఉన్నది వారే..

     

    చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించి హైదరాబాద్‌ లో జరుగుతున్న ఆందోళనపై కేటీఆర్‌ స్పందించారు. చంద్రబాబుపై మాకు సానుభూతి ఉంది. అయితే ఇక్కడ ఆందోళనలు నిర్వహిస్తే ఇక్కడి శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. చంద్రబాబును అరెస్ట్‌ చేసింది బీజేపీనే. అలాగే అక్కడి ప్రభుత్వం పాత్ర కూడా ఉంది.

  • 15 Oct 2023 08:02 PM (IST)

    ప్రవల్లిక ఆత్మహత్యపై కేటీఆర్..

     

    ప్రవల్లిక ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. వాట్సాప్‌ చూసి ప్రేమ వైఫల్యంతో చనిపోయిందని పోలీసులు నిర్ధారించారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ సంఘటనను రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకున్నాయి.
    ఓట్లు, రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. అలాంటిది రాహుల్, ఖర్గే ఒక అమ్మాయి మరణంపై ట్వీట్లు చేసి రాజకీయ ప్రయోజనాలు పొందారు. అసలు ఆ ఆమ్మాయి గ్రూప్‌ 2కు దరఖాస్తు చేయలేదని వార్తలు వస్తున్నాయి.

  • 15 Oct 2023 07:58 PM (IST)

    ప్రధాని మోడీ హామీలు ఏమయ్యాయి?

    నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న మోదీ హామీ ఏమైంది?..9 గంటల కరెంట్‌.. ఒక్క రూపాయికే కేజీ బియ్యం కాంగ్రెస్‌ హామీలు ఏమయ్యాయో ప్రజలకు తెలుసన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసే పార్టీగా బీఆర్‌ఎస్‌కు ప్రజల్లో విశ్వసనీయత ఉందన్నారు కేటీఆర్‌

  • 15 Oct 2023 07:56 PM (IST)

    ప్రయత్నించే వాళ్లకు పుష్కలమైన అవకాశాలు..

    ప్రయత్నించే వాళ్లకు ఈ రాష్ట్రంలో అవకాశాలకు కొదవ లేదు. కొన్ని రోజుల క్రితం రజనీకాంత్‌ హైదరాబాద్‌ కు వచ్చినప్పుడు న్యూయార్క్‌లా ఉందని ప్రశంసలు కురిపించారు. ప్రైవేట్‌ రంగంలోనూ పుష్కలమైన అవకాశాలు కల్పిస్తున్నాం.

  • 15 Oct 2023 07:54 PM (IST)

    పరీక్షలను వాయిదా వేయాలన్నది ప్రతిపక్ష పార్టీలే..

    గ్రూప్‌ 1, గ్రూప్‌2 పరీక్షలను వాయిదా వేయాలన్నది ప్రతిపక్ష పార్టీలే. ఇప్పుడు మళ్లీ లొల్లి పెడుతున్నారు. ప్రతిపక్షాలు ఏది పడితే ఏది మాట్లాడుతున్నాయి. నిరుద్యోగ అభ్యర్థుల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నాయి. 2004 నుంచి 2014లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం 24 వేల ఉద్యోగాలే ఇచ్చింది .అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే.

  • 15 Oct 2023 07:50 PM (IST)

    పెన్షన్ లో లెక్కలు చూసుకోలేదు..

    పెన్షన్‌ను భారంగా బాధ్యతగా చూడాలన్నారు కేటీఆర్‌. సంక్షేమమే ముఖ్యం కానీ లెక్కలు ప్రాధాన్యం కాదన్నారు. నిరుపేదలందరికీ అండగా నిలవడమే ఆసరా పెన్షన్‌ పథకం ఉద్దేశమన్నారు. బీఆర్‌ఎస్‌ జెండా..అజెండా మానవీయతే అన్నారు కేటీఆర్‌. అర్హులందరికీ పెన్షన్‌ అందించేందుకే వయో పరిమితిని 57 ఏళ్లకు తగ్గించామన్నారు.

  • 15 Oct 2023 07:47 PM (IST)

    కర్ణాటక నుంచి కాంగ్రెస్ కు డబ్బులు వస్తున్నాయి..

    ప్రజలకు ఇష్టం లేకపోతే మీరేం చేసినా గెలిపించలేరు. తులం బంగారం ఇచ్చినా మీరు నచ్చకపోతే ఓడిస్తారు.  ఇప్పుడు కర్ణాటక నుంచి కాంగ్రెస్ కు డబ్బుల కట్టలు వస్తున్నాయి..

  • 15 Oct 2023 07:44 PM (IST)

    ఇంతకన్నా ఛండాలం మరొకటి ఉండదు..

    ఇదే రేవంత్ రెడ్డి సోనియా గాంధీని బలి దేవత అన్నాడు. రాహుల్ గాంధీని ముద్ద పప్పు అన్నాడు. అలాగే కొడంగల్ లో ఓడిపోతే  రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నాడు. మరి ఇప్పుడేమైంది. ఓట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్ గా ఇలాంటి మాటలు చెప్పడం చంఢాలం..

  • 15 Oct 2023 07:43 PM (IST)

    రేవంత్‌ సవాల్‌పై కేటీఆర్‌..

    డబ్బులు పంచను.. మద్యం లేకుండా ఎన్నికలు జరిపిస్తారా? అన్న రేవంత్‌ రెడ్డి సవాలుపై కేటీఆర్ స్పందించారు. సూట్‌ కేసులు, డబ్బుల కట్టలతో దొరికిపోయిన ఓ వ్యక్తి ఇలాంటి మాటలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్‌. దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది రేవంత్‌ మాటలు.

  • 15 Oct 2023 07:30 PM (IST)

    కరోనాతో ఖజానాకు లక్ష కోట్ల నష్టం..

    దళిత బంధు, కల్యాణ లక్ష్మి మేం మ్యానిఫెస్టోలో చెప్పలేదు. కానీ సంక్షేమంలో బాగా అమలు చేశాం. అలాగే స్కూల్ పిల్లలకు బ్రేక్‌ ఫాస్ట్‌ పథకాన్ని అమలు చేశాం. కరోనా సమయంలో మా ఖజానాకు  లక్ష కోట్ల నష్టం వాటిల్లింది. అయినా మేం సంక్షేమం కోసం వెనకాడలేదు. పేదవారిని కడుపులో పెట్టుకుని చూశాం.

  • 15 Oct 2023 07:28 PM (IST)

    వాటిని అమలు చేయలేకపోయాం…

    మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌కు, మాకు తేడా ఏంటంటే? వారు చెప్పిన దాంట్లో 5 శాతం మాత్రమే అమలు చేశారు. అదే మా విషయానికొస్తే.. 95 శాతం అమలు చేసి కేవలం 5 శాతం పనులు చేయలేదు. కరోనా కారణంగా మూసీ సుందరీ కరణ, నిరుద్యోగ భృతి.. ఇలా కొన్ని పథకాలు సరిగ్గా అమలు చేయలేకపోయాం.

  • 15 Oct 2023 07:25 PM (IST)

    పెన్షన్ పథకంపై…

    పెన్షన్‌ అనేది ఓ సామాజిక భద్రత. కాంగ్రెస్‌ హయాంలో తూతూమంత్రంగా రూ.200లు ఇచ్చారు. మేం అధికారంలోకి వచ్చాక రూ.1000 లు ఇచ్చాం. మా రాష్ట్రం ఆర్థిక పరిపుష్టి సాధించడంతో రూ. 2000 లు ఇచ్చాం. మేం వాళ్లని కాపీ కొట్టామా? మమ్మల్ని వారు కాపీ కొట్టరా? అనేది ఇక్కడే తెలుస్తుంది.

     

     

  • 15 Oct 2023 07:21 PM (IST)

    కేసీఆర్ ను ఎందుకు దించాలి?

    ‘అధికారంలో ఉన్న వాళ్లు నచ్చపోతే మాత్రమే ప్రజలు వేరొకరి వైపు చూస్తారు. కానీ మా రాష్ట్రంలో అలా లేదు. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లో కేసీఆర్‌ తన దైన ముద్ర వేసుకున్నారు. కాబట్టి ప్రజలు వేరొకరు వైపు చూసే అవకాశం లేదు.’

     

  • 15 Oct 2023 07:19 PM (IST)

    మ్యానిఫెస్టో ఓట్ల కోసం కాదు..

    ‘ఓట్ల కోసం మేం కక్కుర్తి పడడం లేదు. ఇది చేస్తాం.. అది చేస్తాం అని చెప్పడం లేదు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను అమలు చేయాలంటే మూడు రాష్ట్రాల బడ్జెట్‌ అవసరం. మేం అలాంటి ఆశలు ప్రజలకు కల్పించడం లేదు. ఒకసారి కర్ణాటక రాష్ట్రాన్ని చూడండి. అలవీకాని హామీలు ఇచ్చి ఆ రాష్ట్రం ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది.

     

     

  • 15 Oct 2023 07:16 PM (IST)

    మ్యానిఫెస్టోలో చెప్పినవి కొన్నే

    ‘ మేం మ్యానిఫెస్టోలో చెప్పినవి కొన్నే. గత పదేళ్లుగా మా రాష్ట్రంలో చూస్తే మేనిఫెస్టోలో లేని పథకాలు కూడా అమలు చేశాం. మూడోసారి అధికారంలోకి వస్తే మ్యానిఫెస్టోలో చెప్పినవితో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం’- కేటీఆర్‌

  • 15 Oct 2023 07:13 PM (IST)

    కాంగ్రెసోళ్లవి దింపుడు కళ్లెం హామీలు..

    మేం ఏ స్కీమ్ పెట్టినా కొన్ని ప్రాతిపదికలు ఉంటాయి. ఏ పథకం తీసుకున్నా మానవీయ కోణంలోనే ఆలోచించాం. కాంగ్రెస్‌ హామీలు దింపుడు కళ్లెం హామీలు. మా ప్రభుత్వానికి ఎలాంటి కోతలు, సీలింగులు ఉండవు.

  • 15 Oct 2023 07:10 PM (IST)

    ఈ మ్యానిఫెస్టోలో నాకు బాగా నచ్చిన పథకమిదే..

    ఈ మ్యానిఫెస్టోలో నాకు బాగా నచ్చిన పథకం.. కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ ధీమా. ఇది అద్భుతమైన పథకం. అలాగే రైతు భీమా పథకం ప్రపంచంలో మరెక్కడాలేదు. గీత కార్మికులు, నేతన్నల డిమాండ్‌ మేరకే ఈ పథకాలు తీసుకొచ్చాం.

  • 15 Oct 2023 07:06 PM (IST)

    కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను కాపీ కొట్టారా?

    కాంగ్రెస్ మ్యానిఫెస్టోను కాపీ కొట్టారన్న ఆరోపణలపై కేటీఆర్‌ స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే కేసీఆర్‌ నాయకత్వంలోనే రాష్ట్రంలో స్వర్ణయుగం ప్రారంభమైంది. నెలక్రితం కాంగ్రెస్‌ విడుదల చేసిన మేనిఫెస్టోను ఒకసారి చూడండి. అందులో మా ఆసరా పెన్షన్‌ను వారి కాపీ కొట్టారు. దళిత బంధును పేరు మార్చి మరో గ్యారెంటీ స్కీమ్‌ను తీసుకొచ్చారు. ఎవరి కాపీ కొట్టారన్నది ప్రజలే నిర్ణయిస్తారు.

  • 15 Oct 2023 06:48 PM (IST)

    దూకుడుగా బీఆర్ఎస్

    తెలంగాణలో ఎన్నికల ఫీవర్‌ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్‌ కావడంతో అధికార బీఆర్‌ఎస్‌తో పాటు ప్రతి పక్ష కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో తలమునకలయ్యాయి. అయితే ఈ తెలంగాణ దంగల్‌లో కేసీఆర్‌ నేతృత్వంలోని అధికార బీఆర్ఎస్‌ పార్టీ మిగతా పార్టీల కంటే కొంచెం ముందుగా, అన్నిటికీ మించి దూకుడుగా ఉంటోంది