Telangana: మంత్రి కొండా సురేఖకు షాక్.. అధికారిక కార్యక్రమం ఫ్లెక్సీలో కనిపించని ఫోటో!

గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఎక్కడ చూసిన మంత్రి కొండా సురేఖ గురించే టాక్ నడుస్తోంది. తాజాగా ఈ వ్వవహారంలో మరో కీలక పరిణామం వెలుగు చూసింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫోటో మిస్సైంది. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Telangana: మంత్రి కొండా సురేఖకు షాక్.. అధికారిక కార్యక్రమం ఫ్లెక్సీలో కనిపించని ఫోటో!
Minister Konda Surekha Photo Missing

Updated on: Aug 27, 2026 | 7:24 PM

తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ తాజా పరిణామం రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ రేపింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫొటో కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.

అసలేం జరిగింది?

మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఎమ్మెల్యే మురళీనాయక్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అధికారిక ఫ్లెక్సీలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు ఇతర మంత్రుల ఫొటోలు ఉన్నప్పటికీ మంత్రి కొండా సురేఖ ఫోటో మాత్రం కనిపించలేదు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగా ఆమె ఫొటోను పక్కన పెట్టారా? లేక మంత్రివర్గం నుంచి ఆమెను తప్పించబోతున్నారనే ప్రచారానికి ఇది సంకేతమా? అనే చర్చ మొదలైంది.

ఇదిలా ఉండగా ప్రభుత్వ ఫ్లెక్సీలో ప్రోటోకాల్ ప్రకారం మంత్రి ఫొటో లేకపోవడం ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ వివాదంపై స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ స్పందిస్తూ.. ఇది చాలా సున్నితమైన వ్యవహారమని వ్యాఖ్యానించారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us