కొత్తగా బాధ్యతలు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యాటక, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎవరికైనా సహాయం చేయాలంటే ముందు వరుసలో నిలిచే సురేఖ వరంగల్‌లోని నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారి వైద్య చికిత్స కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సత్వర సహాయాన్ని అందించి, చిన్నారి క్షేమంగా ఇల్లు చేరుతుంది అంటూ ఆ తండ్రికి భరోసా ఇచ్చారు.
హన్మకొండ జిల్లాలోని రెడ్డి కాలనీకి చెందిన మహమ్మద్ నసిమ్ హైమద్ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. చిన్న అబ్బాయి ఎండీ ఆదిల్ హైమాద్ కు కొంత కాలంగా బొన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు.. లక్షల రూపాయలు వెచ్చింది వైద్యం చేయించలేక పేదరికంతో బాధపడుతున్న ఆ కుటుంబం మంత్రి కొండ సురేఖను కలిసి వారి బాధను విన్నవించారు. ఆ కుటుంబం పడుతున్న వ్యధకు చలించిపోయిన మంత్రి కొండ సురేఖ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి సమస్య తీవ్రతను తెలియజేశారు.
వెనువెంటనే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పిల్లాడి చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. పేద ప్రజల వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆపదలో ఉన్న రోగులను ఆదుకునేందుకు అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి కొండ సురేఖ స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఆర్ధిక స్థోమత కారణంగా ఎవరు దిగులుపడవద్దని, ప్రజా ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అండగా వున్నారని మంత్రి సురేఖ భరోసా ఇచ్చారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందాన్నారు. ప్రజా వైద్య సమస్యల దృష్ట్యా ఆరోగ్య శ్రీ రూ. 5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు రాష్ట్ర అటవీశాఖ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. దీంతో మంత్రికి మహమ్మద్ నసిమ్ హైమద్ దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…