Telangana: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేనే లేదు.. ఆ పుకార్లను నమ్మొద్దు: మంత్రి గంగుల కమలాకర్

|

Jun 07, 2022 | 7:59 PM

రాష్ట్రంలోని 3520 బంకుల్లో సరిఫడా స్టాక్ ఉందని.. ఎప్పటిమాదిరిగానే నిరంతరాయంగా రోజువారిగా నిల్వలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Telangana: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేనే లేదు.. ఆ పుకార్లను నమ్మొద్దు: మంత్రి గంగుల కమలాకర్
Gangula Kamalakar
Follow us on

Petrol and Diesel in Telangana: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేనే లేదని.. ప్రజలెవరూ పుకార్లను నమ్మి భయాందోళనలకు గురికావద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. రాష్ట్రంలో, హైదరాబాద్‌లో గతంలో మాదిరే డిమాండ్ ఉందని గంగుల (Gangula Kamalakar) పేర్కొన్నారు. రాష్ట్రంలోని 3520 బంకుల్లో సరిఫడా స్టాక్ ఉందని.. ఎప్పటిమాదిరిగానే నిరంతరాయంగా రోజువారిగా నిల్వలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంగళవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనవసర పుకార్లకు ప్రజలెవరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఎవరికి ఎంత కావాలంటే అంత పెట్రోల్, డీజిల్ పోయించుకోవచ్చని పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థల బస్సులు సైతం రిటైల్ బంకుల నుంచే డిజీల్‌ను వాడుకుంటున్నారని అందువల్ల బంకుల్లో త్వరత్వరగా స్టాక్స్ అయిపోతున్నాయన్నారు. వీటిపై సివిల్ సప్లైస్ డిపార్మెంట్ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ కొరత లేకుండా చూస్తుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

రాష్ట్రంలో మొత్తం అన్ని కంపెనీలవి కలిపి 3520 బంకులతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని 480 బంకుల్లో నిరంతరాయంగా పెట్రోల్, డీజిల్ సరఫరా కొనసాగిస్తున్నామన్నారు. 807 ఎల్పీజీ ఔట్ లెట్లలో సైతం కావాల్సినంత స్టాక్ ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెగ్యులర్‌గా ఉండేవిదంగానే పెట్రోల్ 38,571 కిలీ లీటర్లు, డీజిల్ 23,875 కిలో లీటర్లు ఉందని ఇది నాలుగు నుంచి ఐదు రోజులకు సరిపోతుందన్నారు. స్టాక్ మూమెంటుకు అనుగుణంగా నిరంతరాయంగా పెట్రోల్, డీజిల్ రాష్ట్రానికి వస్తూనే ఉందన్నారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోనూ పెట్రోల్, డీజిల్ వినియోగంలో గతంలో మాదిరిగానే ఉందని, ఎక్కడా కృత్రిమ కొరత సృష్టించకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించమని, లైసెన్సుల రద్దు చేయడానికి సైతం వెనుకాడమంటూ మంత్రి గంగుల హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కమిషనర్ వి. అనిల్ కుమార్, ఆయిల్ కంపెనీల స్టేట్ కో ఆర్డినేటర్ యెతేంద్ర పాల్ సింగ్, హెచ్పీసీఎల్ చీఫ్ మేనేజర్ పి. మంగీలాల్, బీపీసీఎల్ డీజీఎం కెఎస్వీ బాస్కర్ రావు, ఐఓసీఎల్ జనరల్ మేనేజర్లు ఎన్ బాలక్రుష్ణ, ఎం.బి.మనోహర్ రాయ్ ఇతర సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..