
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 14: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భద్రాద్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, పాల్వంచలో భూప్రకంపనలు వచ్చాయి. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురైనారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.8గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆకస్మికంగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది నిద్రలో ఉండగానే ప్రకంపనలు గమనించి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
An #earthquake of magnitude 3.8 on the Richter scale occured in Bhadradri Kothagudem, Telangana @NCS_Earthquake #Earthquake #Telangana #BhadradriKothagudem #NCS pic.twitter.com/4hyf2fRAy9
— DD News (@DDNewslive) June 14, 2026
అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ప్రకంపనలు స్పష్టంగా అనిపించడంతో స్థానికుల్లో కొంతసేపు ఆందోళన నెలకొంది. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.