హైదరాబాద్ లోని మేరు ఇంటర్నేషనల్ స్కూల్.. బ్రైన్‌ఫీడ్ స్కూల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ – 2022 ద్వారా దేశంలోని టాప్-500 పాఠశాలల్లో ఒకటిగా ఎంపికైంది. కిండర్ గార్టెన్ నుంచి సీనియర్ సెకండరీ స్కూల్ వరకు పిల్లల్లో జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి మేరు ఇంటర్నేషనల్ స్కూల్ చేపడుతున్న వినూత్న పద్ధతులను గుర్తించి ఈ అవార్డు అందించారు. స్కూల్ డైరెక్టర్ శ్రీమతి మేఘనరావు జూపల్లి రూపొందించిన ప్రత్యేకంగా రూపొందించిన M-CLAP (కెరీర్ రెడీనెస్, లీడర్‌షిప్ & లైఫ్ స్కిల్స్, అకడమిక్స్ & ఎన్‌రిచ్‌మెంట్ ప్రోగ్రామ్) ద్వారా ఈ అవార్డు అందుకోవడం సాధ్యమైంది. M-CLAP అనేది పరిశోధన-ఆధారిత కే-12 పాఠ్యాంశం. విద్యార్థుల కెరీర్ సంసిద్ధత, నాయకత్వం, జీవన నైపుణ్యాలను అందించేందుకు ఉపాధ్యాయులకు అవసరమైన సాధనాలు, నైపుణ్యాలను ఎం.క్లాప్ అందిస్తుంది. 30 కంటే ఎక్కువ క్లిష్టమైన సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలను కార్యాచరణ ఆధారిత పాఠాలతో విద్యార్థులు సమర్థవంతంగా ఎలా కమ్యూనికేట్ చేయాలనే విషయాలను నేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది. లక్ష్యాలు ఏర్పరచుకోవడం, సాధించడం, విభేదాలు, సమస్యల పరిష్కారం, గౌరవించడం, పరస్పరం సహకరించుకోవడం అనే అంశాలపై విద్యార్థులు అవగాహన ఏర్పరచుకుంటారు.
మేరు ఇంటర్నేషనల్ స్కూల్ M- CLAP ప్రోగ్రామ్ నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడానికి, కెరీర్ ను ఎంచుకునే స్వేచ్ఛను విద్యార్థులకు అందించడానికి ప్రారంభ దశ. ఈ అత్యుత్తమ విజయానికి మేరు స్కూల్ అకడమిక్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్‌తో పాటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
Broccoli Health Benefits: బ్రకోలితో బోలెడు లాభాలు.. ఇలా ట్రై చేస్తే మరింత రుచికరం..
తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్ సింగర్
Pawan Kalyan Fans: ఊరికే హీరోలైపోరు మరి.. పవర్ స్టార్ స్పెషల్ ట్రైనింగ్ పై ఫ్యాన్స్ ఏమంటున్నారంటే