
తెలంగాణలో చలి వణికిస్తోంది. చాలా జాల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. జనవరి నెల ప్రారంభంలో సాధారణ శీతాకాలం ఉన్నా, సంక్రాంతికి మళ్లీ చలి పెరిగి, చివరి వారం నుంచి తగ్గుముఖం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నాలుగైదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు.. 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అటు చలి.. ఇటు వాయు కాలుష్యం హైదరాబాద్‌ను చుట్టుముట్టింది. భాగ్యనగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 230 దాటి ప్రమాదకర స్థాయికి చేరింది. గరిష్టంగా అమీన్‌పూర్ 289 పాయింట్లు.. గచ్చిబౌలిలో 286.. మాదాపూర్, విట్టల్‌రావు నగర్‌లో 230 పాయింట్లుగా నమోదైంది. సనత్‌నగర్, కూకట్‌పల్లి, బాలానగర్, సోమాజిగూడ, కోటి, బంజారా హిల్స్, మణికొండ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బొల్లారం ఇండస్ట్రీయల్ ఏరియాతో పాటు నగరంలో పలు ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 పాయింట్లు దాటింది. చలి, పొగ మంచు కారణంగా వాయు కాలుష్యం పెరిగింది. శీతాకాలపు పొగమంచుకు తోడు వాహనాల ఉద్గారాలు, చెత్త దహనం వల్ల గాలిలో సూక్ష్మ ధూళికణాలు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే ఉదయం సమయంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాలు, ఐటీ జోన్లు, రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ల వెంట ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. మరోవైపు ఏపీలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య గాలులు వీస్తున్నట్లు వెల్లడించింది. గరిష్టంగా బాపట్లలో 31 డిగ్రీలు.. కళింగపట్నంలో కనిష్టంగా 26.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలుస్తోంది.
GOOD NEWS 🥶😀
The 25day long COLDWAVE conditions will finally end on December 31
Thereafter NORMAL WINTER conditions are expected in entire Telangana with seasonal day, night temperatures
It doesn’t mean that winters are done. Even in January, we will have DECENT COLD…
— Telangana Weatherman (@balaji25_t) December 25, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి