కాపురానికి రాని భార్య.. తీవ్ర మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య.. మనోహరాబాద్‌లో విషాదం!

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థలు, కుటుంబ కలహాలు చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. భార్య కాపురానికి తిరిగి రావడం లేదనే తీవ్ర వేదనతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కాపురానికి రాని భార్య.. తీవ్ర మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య.. మనోహరాబాద్‌లో విషాదం!
Marital Problems

Edited By:

Updated on: Oct 08, 2026 | 7:50 PM

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య కాపురానికి తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మనోహరాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన చింతల వెంకటేష్ కు ఆరు సంవత్సరాల క్రితం సిద్దిపేట జిల్లా చిల్లసారం (క్షీరసాగర్) గ్రామానికి చెందిన మౌనికతో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కుటుంబ కలహాల కారణంగా సుమారు రెండేళ్ల క్రితం మౌనిక తన పుట్టింటికి వెళ్లినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆమె తిరిగి భర్త వద్దకు రాకపోవడంతో వెంకటేష్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ క్రమంలో సెప్టెంబర్ 30న ఇంటి సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంకటేష్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి బయటకు వెళ్లి చూడగా..చెట్టుకు వేలాడుతూ కనిపించాడు.కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆర్‌పీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వెంకటేష్ మంగళవారం రాత్రి మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

కుటుంబ సమస్యలు, ఒత్తిడి లేదా వ్యక్తిగత కష్టాల కారణంగా ఎవరైనా తీవ్రంగా బాధపడుతున్నట్లయితే వారిని ఒంటరిగా వదిలేయకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు వెంటనే అండగా నిలవడం చాలా ముఖ్యం. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అత్యవసర సేవలను సంప్రదించాలని పోలీసులు, మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తు్న్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us