Lakshmi Manchu: మంచి మనసు చాటుకున్న మంచు లక్ష్మి.. ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న..

|

Jul 22, 2022 | 6:55 AM

Lakshmi Manchu: నటిగా, నిర్మాతగా, సింగర్‌గా ఇలా మల్టీ ట్యాలెంట్‌ ఉన్న అతి కొద్ది మంది సినీ తారల్లో మంచు లక్ష్మి ఒకరు. కుటుంబ నేపథ్యం అండగా ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును...

Lakshmi Manchu: మంచి మనసు చాటుకున్న మంచు లక్ష్మి.. ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న..
Follow us on

Lakshmi Manchu: నటిగా, నిర్మాతగా, సింగర్‌గా ఇలా మల్టీ ట్యాలెంట్‌ ఉన్న అతి కొద్ది మంది సినీ తారల్లో మంచు లక్ష్మి ఒకరు. కుటుంబ నేపథ్యం అండగా ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సమాజంలో నిత్యం చురుకుగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొనడం మంచు లక్ష్మికి అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా లక్ష్మి తన మంచి మనుసును చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించి గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలలను లక్ష్మి దత్తత తీసుకున్నారు. ఈ స్కూళ్లను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 1 నుంచి 5 తరగతుల వరకు మూడు సంవత్సరాల పాటు స్మార్ట్‌ క్లాసెస్‌ నిర్వహిస్తూనే, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు లక్ష్మి తెలిపారు. పిల్లలు చదువు మధ్యలో ఆపేయకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఇక లక్ష్మి గొప్ప మనసు తెలిసిన వారు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..