AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎందుకమ్మా ఇలా చేస్తున్నావ్.. తల్లి దారి తప్పిందని కొడుకు ఆత్మహత్య.. యువకుడి ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు..

పిల్లలకు మంచి, చెడ్డలు నేర్పించాల్సిన తల్లే దారి తప్పింది ప్రవర్తించింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ తల్లి చేసిన పాడు పనికి కన్న కొడుకు మనో వేదనకు గురయ్యాడు. తెలిసిన వారు సూటి పోటి మాటలతో మరింత బాధపెట్టడంతో తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించి సోదరి తమ్ముడిని కాపాడుకునేందుకు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఎలాంటి లాభం లేకపోయింది. చివరి క్షణాల్లో తన ఆవేదనను వీడియోలో క్రియేట్‌ చేసి ఆ యువకుడు ప్రాణాలు వదిలాడు. వీడియో చూసిన పలువురు కన్నీరు పెడుతున్నారు.

ఎందుకమ్మా ఇలా చేస్తున్నావ్.. తల్లి దారి తప్పిందని కొడుకు ఆత్మహత్య.. యువకుడి ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు..
Young Man Suicide
Naresh Gollana
| Edited By: |

Updated on: Aug 07, 2025 | 6:43 PM

Share

ఓ తల్లి చేసిన పాడు పనికి కన్న కొడుకు మనో వేదనకు గురయ్యాడు. తెలిసిన వారు సూటి పోటి మాటలతో మరింత బాధపెట్టడంతో తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన సోదరి తమ్ముడిని కాపాడుకునేందుకు హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది.. కానీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ యువకుడు తనువు చాలించాడు. చివరి నిమిషంలో తన చావుకు తన తల్లి , తల్లితో వివాహేతర సంబందం పెట్టుకున్న ఆ వ్యక్తే కారణం అంటూ తన ఆవేదనను చెప్పుకున్నాడు. ఈ మేరకు మరణ వాగ్మూలం ఇచ్చి తుదిశ్వాస విడిచాడు. ఆ యువకుడి మృతిని జీర్ణించుకోలేని తోటి స్నేహితులు, కుటుంబ సభ్యులు అనుమానితుడి ఇంటిపై దాడికి దిగారు. ఇంటికి నిప్పటించి మృతదేహాంతో ఆందోళన చేపట్టారు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు‌చేసుకుంది.

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారాం గ్రామానికి చెందిన దుర్కి అనిల్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. తన తల్లి రాజేశ్వరి అదే గ్రామానికి చెందిన మూడపల్లి తిరుపతి అనే వ్యక్తితో వివాహేతర సంబందం పెట్టుకుందని.. ఈ విషయం తెలిసిన దగ్గరి బంధువులు ప్రశ్నించడంతో మనోవేదనకు గురైన అనిల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన సోదరి అనిత కుటుంబ సభ్యులకు‌ సమాచారం ఇవ్వడంతో అనిల్‌ను వెంటనే మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అనిల్ మృతి చెందాడు.

చికిత్స పొందుతున్న చివరి సమయంలో తన ఆత్మహత్య యత్నానికి కారణం తన తల్లి రాజేశ్వరి, తిరుపతి లంటూ మరణ వాగ్మూలం ఇచ్చాడు. అనిల్ మృతికి కారణమైన తిరుపతిని అరెస్ట్ చేయాలంటూ అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు మృతదేహాంతో తిరుపతి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. అంతటితో ఆగకుండా తిరుపతి ఇంటి పై దాడిచేసి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. పోలీసులు నచ్చ చెప్పడంతో నాలుగు గంటల ఆందోళన అనంతరం మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.