
ప్రయాణికులకు గుడ్ న్యూస్. నాగ్‌పూర్–సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తెలంగాణలో మరో రెండు స్టేషన్లలో ఆగనుంది. మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో కొత్త స్టాపులు ఇవ్వాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 20101/20102 నంబర్లతో నడుస్తున్న ఈ రైలు.. ప్రయోగాత్మకంగా ఈ రెండు చోట్ల ఆగనుంది. అయితే ఈ కొత్త స్టాపులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే విషయాన్ని ఇంకా రైల్వే అధికారులు ప్రకటించలేదు.
మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రాంతాల్లో ఎక్కువమంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపార వేత్తలు, కర్మాగార కార్మికులు.. రైలు ప్రయాణంపై ఆధారపడి ఉంటారు. ఈ క్రమంలోనే ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రయాణికుల నుంచి డిమాండ్ రావడంతో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు స్టేషన్లను వందే భారత్‌కి ప్రయోగాత్మక స్టాపులుగా చేర్చాలని రైల్వే బోర్డు ఇప్పటికే అధికారిక ఆదేశాలు జారీ చేసింది. కానీ అమలుయ్యే తేదీపై స్పష్టత రాకపోవడంతో ప్రయాణికులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
మంచిర్యాల కాంగ్రెస్ ఎంపీ వంశీ గడ్డం ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. “మంచిర్యాలకు ఇది పెద్ద గుడ్ న్యూస్. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, దక్షిణ మధ్య రైల్వే జీఎం, రైల్వే బోర్డు చైర్మన్‌తో ఏడాది పాటు నేను చేసిన కృషి ఫలించింది. మంచిర్యాల ఇప్పటికే ఎదుగుతున్న పారిశ్రామిక కేంద్రం. ఈ కొత్త స్టాప్ స్థానిక ప్రజలు, పరిశ్రమలు, భవిష్యత్తు అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మన ప్రాంతానికి గర్వకారణం” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Big News for Mancherial! 🚆
After one year of consistent efforts and follow-ups with Railway Minister Shri Ashwini Vaishnaw ji, South Central Railway General Manager, and the Railway Board Chairman, I am very happy to share that Mancherial has officially been granted a stop.… pic.twitter.com/1nGShofMl2
— Vamsi Gaddam (@vkgaddam) August 30, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..