Hyderabad Rains: ఓరి దేవుడా.. వరద నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. క్షణాల్లోనే అంతా..!

|

Aug 20, 2024 | 12:09 PM

హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ తెల్లారు జామున నగర వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదు కావడంతో ప్రధాన రహదార్లపైకి భారీగా వరదనీరు వచ్చి చేరింది.

Hyderabad Rains: ఓరి దేవుడా.. వరద నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. క్షణాల్లోనే అంతా..!
Man Washed Away In Rain Water
Follow us on

హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ తెల్లారు జామున నగర వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదు కావడంతో ప్రధాన రహదార్లపైకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు ఓ వ్యక్తి మృతిచెందారు. పార్సీ గుట్ట నుంచి వరదనీటిలో రోడ్డుపైకి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడిని రాంనగర్‌కు చెందిన అనిల్‌గా గుర్తించారు.

ఇక ఇందిరానగర్‌లోని రోడ్డులో ఓ వ్యక్తి బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. గ్రీన్ బావర్చి హోటల్ సమీపంలో టూవీలర్ అదుపుతప్పడంతో ఓ వ్యక్తి వరదలో కొట్టుకుపోయాడు. అతన్ని గమనించిన స్థానికులు అప్రమతమై, అతన్ని కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

వీడియో చూడండి..

 

భారీగా కురిసిన వర్షానికి హైటెక్‌ సిటీ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తెలంగాణ అంతటా ఇంకో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. జనగామ, గద్వాల, మహబూబ్‌ నగర్‌, మెదక్‌, నల్గొండ, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట్‌, సిద్ధిపేట, వనపర్తికి ఐఎండీ వర్ష సూచన జారీ చేసింది. రంగారెడ్డి,సంగారెడ్డి, వికారాబాద్‌, భువనగిరిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు పడతాయని హెచ్చరించింది. ఖమ్మం, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..