Telangana Elections: బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై హత్యాయత్నం.. ప్రచారంలో కత్తితో దాడి చేసిన దుండగుడు

బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్ధి, స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి‌పై గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గుర్తించిన కార్యకర్తలు హుటాహుటిన ప్రభాకర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు.

Telangana Elections: బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై హత్యాయత్నం.. ప్రచారంలో కత్తితో దాడి చేసిన దుండగుడు
Brs Mp Kotha Prabhakar

Updated on: Oct 30, 2023 | 2:12 PM

మెదక్‌, అక్టోబర్ 30: బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎన్నికల ప్రచారంలో దుండగుడు కత్తితో దాడి చేశాడు. ప్రభాకర్‌రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని బీఆర్ఎస్ కార్యకర్తలు చితక్కొట్టారు. దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో ఈ  ఘటన చోటు చేసుకుంది. దుబ్బాక నుంచి పోటీ చేస్తున్నారు కొత్త ప్రభాకర్‌రెడ్డి.

ప్రస్తుతం ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. ఇందులో భాగంగా కొత్త ప్రభాకర్ రెడ్డి దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడంతో ఆయన కారు నుంచి కిందికి దిగిన తర్వాత కత్తితో దాడి చేశాడు నిందితుడు. వెంటనే ప్రభాకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడ్ని మిరుదొడ్డి మండలం చెప్పాల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగిందన్న సమాచారం తెలిసిన వెంటనే మంత్రి హరీష్‌ రావు హుటాహుటిన ఫోన్‌లో మాట్లాడారు. అవసరం అయితే హైదరాబాద్ కు తీసుకురావాలని బీఆర్‌ఎస్‌ నేతలకు హరీష్‌ రావు సూచించారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారిని మెరుగైన వైద్యం కోసం గజ్వేల్ ఆసుపత్రి నుండి అంబులెన్స్ లో సికింద్రాబాద్ యశోద కు తరలిస్తున్నారు.

హత్యాయత్నంను వీడియోను ఒక్కడ చూడండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి