Online Loan App: రెచ్చిపోయిన ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకులు.. బంధువులకు మేసేజ్‌లు.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య..

|

Jan 02, 2021 | 3:46 PM

Online Loan App: ఆన్‌లైన్ యాప్ నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారు. రుణాల పేరుతో ప్రజలు మరింత వేధింపులకు గురి చేస్తున్నారు..

Online Loan App: రెచ్చిపోయిన ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకులు.. బంధువులకు మేసేజ్‌లు.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య..
Follow us on

Online Loan App: ఆన్‌లైన్ యాప్ నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారు. రుణాల పేరుతో ప్రజలు మరింత వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా ఆల్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు తట్టుకోలేక మరో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలో నివసించే గుజ్జ చంద్రమోహన్ అనే వ్యక్తికి ఆన్‌లైన్ యాప్ లోన్ కట్టాలి అంటూ వేధింపులు ఎదురయ్యాయి. దాంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. అయినప్పటికీ వేధింపులు తగ్గకపోగా.. మరింత ఎక్కువ అయ్యాయి. బాధిత వ్యక్తి ఫోన్లో ఉన్న ఇతరుల నెంబర్లకు మెసేజ్‌లు పంపించారు ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకులు దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రమోహన్ శనివారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Also read:

Warangal Kaloji Narayana Rao University: వరంగల్‌ కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

Vishnu Vardhan Reddy tweeted : ఏపీలో ఆలయాలపై దాడులు పెరిగిపోతున్నాయంటూ విష్ణు వర్ధన్ రెడ్డి ట్వీట్..