Telangana: అవినీతి అధికారికి వెరైటీ సత్కారం.. లంచం అడిగినందుకు ఏం చేశారో తెలిస్తే..

ప్రభుత్వ ఉద్యోగి తాను చేయాల్సిన విధికి కూడా డబ్బులు వసూలు చేస్తూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటారు. అయితే కొందరు ఎంతొ కొంత ఇచ్చేసి మన పని మనం పూర్తి చేసుకుందాం అన్నట్లు ఉంటారు. కానీ మరికొందరు మాత్రం లంచం అడిగిన వారి భరతం పడతారు. తాజాగా లంచం అడిగిన ఓ అధికారికి వెరైటీగా సత్కారం చేసి, చెంప్ప చెల్లుమనిపించే...

Telangana: అవినీతి అధికారికి వెరైటీ సత్కారం.. లంచం అడిగినందుకు ఏం చేశారో తెలిస్తే..
Representative Image

Edited By:

Updated on: Dec 13, 2023 | 12:27 PM

లంచం.. ఒక్క భారత్‌లో మాత్రమే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ జాడ్యం ఉంది. ప్రభుత్వ ఉద్యోగి తాను చేయాల్సిన విధికి కూడా డబ్బులు వసూలు చేస్తూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటారు. అయితే కొందరు ఎంతొ కొంత ఇచ్చేసి మన పని మనం పూర్తి చేసుకుందాం అన్నట్లు ఉంటారు. కానీ మరికొందరు మాత్రం లంచం అడిగిన వారి భరతం పడతారు. తాజాగా లంచం అడిగిన ఓ అధికారికి వెరైటీగా సత్కారం చేసి, చెంప్ప చెల్లుమనిపించే పని చేశారు.

వివరాల్లోకి వెళితే.. మత్సకారుల సొసైటీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏకంగా ఓ జిల్లా అధికారి మెడలోనే కరెన్సీ నోట్ల దండ వేసి ఆయన అవినీతిని బట్టబయలు చేశారు. ఓ వైపున ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి మరో వైపున జిల్లా అధికారి మెడలో నోట్ల హారం వేయడం సంచలనంగా మారింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… జగిత్యాల జిల్లా కేంద్రం మత్స శాఖ అధికారి దామెదర్ సొసైటీలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ విషయంపై నిత్యం అధికారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని మత్స సొసైటీల ప్రతినిధులు ఆరోపించారు.

సొసైటీల ఏర్పాటు కోసం లంచం ఇవ్వాలని జిల్లా అధికారి దామోదర్ డిమాండ్ చేస్తుండడంతో చేసేదేమీ లేక ఆయన మెడలో కరెన్సీ నోట్ల దండలు వేశామని వారు తెలిపారు. మొదట అధికారి కార్యాలయంలో వెల్లిన మత్య్సకారులు అతన్ని నిలదీసి కార్యాలయం నుంచి బయటకు రాగానే ఆయన మెడలో నోట్లతో చేసిన హారం వేయడం సంచలనంగా మారింది. సాక్షాత్తు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోనే మత్సకారులు వినూత్న రీతిలో నిరసన తెలిపిన తీరు హాట్ టాపిక్‌గా మారింది.

గతంలో మహారాష్ట్రంలోని ఔరంగాబాద్ లో ఓ సర్పంచ్ ను అక్కడి అధికారులు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అతనే మెడలో కరెన్సీ నోట్ల దండలు వేసుకుని కార్యాలయం ముందు నిరసన తెలిపిన ఘటన పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తాజాగా సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో మత్స్యకారులు డబ్బుల దండ వేయడం సరికొత్త చర్చకు దారి తీసింది.

చర్యలు తీసుకుంటాం..

ఇదిలా ఉంటే.. జగిత్యాల జిల్లా మత్స శాఖ అధికారి దామోదర్ పై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తామని, ఆయన వివరణ తీసుకుంటామని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష ప్రకటించారు. అతనిచ్చిన వివరణ తరువాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..