Telangana: నన్నే ఆపుతావా అంటూ ఇంటి నుంచి పారిపోయిన భర్త.. కట్ చేస్తే ఊహించని దృశ్యం..

సిద్దిపేట పట్టణం దోభిగల్లిలో విషాదం చోటు చేసుకుంది. భార్య తనను మద్యం తాగొద్దన్నదని.. మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

Telangana: నన్నే ఆపుతావా అంటూ ఇంటి నుంచి పారిపోయిన భర్త.. కట్ చేస్తే ఊహించని దృశ్యం..
Wife And Husband

Edited By:

Updated on: Mar 09, 2023 | 10:48 AM

సిద్దిపేట పట్టణం దోభిగల్లిలో విషాదం చోటు చేసుకుంది. భార్య తనను మద్యం తాగొద్దన్నదని.. మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భూంపల్లి సిద్దుకుమార్(32) మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి వచ్చేవాడు. అయితే, రోజూలాగే బుధవారం కూడా సిద్దుకుమార్ మద్యం సేవించి వచ్చాడు. భార్యను అన్నం పెట్టమని కోరగా.. ఆమె అన్నం పెట్టింది. అయితే, అన్నం తిన్న తరువాత సిద్దుకుమార్.. మళ్లీ మద్యం తాగి వస్తానంటూ భార్య చెప్పి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే, అతని భార్య అడ్డుకుంది. మద్యం తాగొద్దని బ్రతిమాలింది, వారించింది.

దాంతో ఇద్దరి మధ్య స్వల్ప వాదన జరిగింది. ‘నువ్ నన్ను మద్యం తాగొద్దని ఆపుతున్నావు. నేను చచ్చిపోతా’ అంటూ ఇంటి నుంచి పారిపోయాడు. అయితే, ఇంటి నుంచి వెళ్లిపోయిన సిద్దు కుమార్ కోసం అతని భార్య, బంధువులు భూంపల్లి సాయికృష్ణ, నాగరాజు కలిసి వెతికారు. వ్యవసాయ క్షేత్రాల్లో రైతులను ఆరా తీయగా వారు చెప్పిన ప్రకారం వెతికారు. ఇంతలో ఓ బావిలో సిద్దుకుమార్ పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే బావిలోకి అతన్ని బయటకు తీశారు. కానీ, అప్పటికీ జరగాల్సి ఘోరం జరిగిపోయింది. సిద్దుకుమార్ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us