సంచలనం సృష్టించిన రౌడీషీటర్ హత్య కేసు మిస్టరీని బాలాపూర్ పోలీసులు ఛేదించారు. డబ్బులు, సెల్ ఫోన్లు, బైక్‌లు బలవంతంగా లాక్కోవడంతో పాటు హోమో సెక్స్ అంటూ వేధిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అలాగే రౌడీషీటర్ ముబారక్ సిగార్‌ను హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న ఈ 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి వెల్లడించారు. నిందితుల వద్ద మూడు సెల్ ఫోన్లు, నాలుగు బైక్‌లు, నాలుగు కత్తులు, వుడెన్ బేస్ బాల్ స్ట్రైక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ సునీత రెడ్డి మీడియాకు వివరించారు. బాలాపూర్ మండలం కొత్తపేట్ గ్రామం అబుబకార్ కాలనీకి చెందిన ముబారక్ బీన్ అబ్దుల్లా అలియాస్ ముబారక్ సిగార్ 23 కేసుల్లో నిందితుడు. ఇతనిపై మూడు మర్డర్ కేసులు, రెండు కిడ్నాప్‌లు, 3 హత్యాయత్నం కేసులు, ఐదు దాడి కేసులు, ఏడు దొంగతన కేసులతో పాటు మొత్తం 23 కేసులు ఉన్నాయి. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తరచు శాంతిభద్రలకు విఘాతం కలిగించడంతో పాటు స్థానికుల వద్ద కూడా దౌర్జన్యంగా డబ్బులు, సెల్ ఫోన్లు, బైక్లను లాక్కుని తిరిగి వాళ్లకు ఇచ్చేవాడు కాదు. అంతేకాకుండా మైనర్లను బెదిరించి హోమో సెక్స్‌కు పాల్పడేవాడు.
ఈనెల 6వ తేదీన షేక్ అమీర్ స్నేహితుడైన సయ్యద్ ఇలియాస్ వద్ద నుంచి 1500 నగదుతో పాటు యాక్టివా బైక్‌ను ముబారక్ సిగార్ లాక్కుని తిరిగి ఇవ్వలేదు. కాగా ఈనెల 7న క్యూబా కాలనీ వద్ద మజిలీస్ పార్టీ కార్యాలయం వద్ద అమీర్, సయ్యద్ కాజా వద్దకు వచ్చిన ముబారక్ సిగార్ వాళ్లకు సంబంధించిన రెండు సెల్ ఫోన్లను బలవంతంగా లాక్కున్నాడు. ఈనెల 8వ తేదీన మళ్లీ సయ్యద్ కాజా నుంచి 2 మొబైల్ ఫోన్ లతో పాటు పల్సర్ బైక్లను లాక్కున్నాడు. 9వ తేదీన షేక్ అమీర్ మరో స్నేహితుడైన అబ్దుల్ ఫరీద్ ఖాన్ వద్ద నుంచి రెండు వేల నగదుతో పాటు వివో సెల్ ఫోన్‌ను లాక్కున్నాడు. ఈనెల10వ తేదీన ఉదయం 10 గంటలకు షేక్ అమీర్, రౌడీషీటర్ ముబారక్ సిగార్ ను కలుసుకుని అబ్దుల్ ఫరీద్ ఖాన్, సయ్యద్ కాజా, సయ్యద్ ఇలియాస్‌ల వస్తువులు, నగదును తిరిగి ఇచ్చేయాలని హెచ్చరించాడు.
దీంతో రౌడీషీటర్ బైక్ లు మాత్రమే తిరిగి ఇవ్వగా మిగతా సెల్ ఫోన్లు, డబ్బులు తిరిగి ఇవ్వలేదు. అతని స్నేహితుల వద్ద నుంచి తరచూ నగదు సెల్ ఫోన్ లు, బైక్ లు లాక్కోవడంతో పాటు హోమో సెక్స్ చేయాలంటూ ముబారక్ సిగార్ బలవంతం చేస్తూ బెదిరించసాగాడు. తరచూ వేధిస్తూ ఉండడంతో ఎలాగైనా రౌడీషీటర్ ముబారక్ సిగార్ ను హత్య చేయాలని షేక్ అమీర్ తన స్నేహితులతో కలిసి రౌడీషీటర్ ఇస్మాయిల్‌తో సమావేశమై హత్యకు కుట్రపన్నారు. రౌడీ షీటర్ ముబారక్ సిగార్ వాదియే ముస్తఫాకు చేరుకున్నాడు. అదే సమయంలో అనుకోకుండా వచ్చిన రౌడీషీటర్ షేక్ ఇస్మాయిల్, షేక్ ఆమీర్, మహమ్మద్ సయ్యద్, షేక్ హుస్సేన్, అబ్దుల్, ఫరీద్ ఖాన్, సయ్యద్, షేక్ హుస్సేన్, అబ్దుల్, ఫరీద్ ఖాన్, సయ్యద్ ఖాజా, సయ్యద్ ఇలియాస్, మహమ్మద్ సమీర్లతో గొడవకు దిగారు. మాట మాట పెరగడంతో బేస్ బాల్ బ్యాట్, కట్టెలు, కత్తులతో రౌడీషీటర్ ముబారక్ సిగార్‌ను విచక్షణ రహితంగా దాడి చేసి హతమర్చారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న 8 మంది నింధితులను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..