MLA Shankar Naik
Mahbubnagar: మహబూబాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్‌రావు వర్గాలంటూ రెండుగా చీలిపోయారు. ఈ క్రమంలోనే ‘మాకు వద్దు ఈ ఎమ్మెల్యే’ అంటూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పట్టణ శివారులోని ఓ మామిడి తోటలో దాదాపు 100 మంది ప్రజాప్రతినిధులు శనివారం సమావేశమయ్యారు. మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. శంకర్ నాయక్‌కు టికెట్ ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించి.. నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు కౌన్సిలర్లు.
‘శంకర్ నాయక్ వద్దు.. కొత్తవ్యక్తి ముద్దు’ అనే నినాదాలు చేశారు పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు. మహబూబాబాద్ నియోజకవర్గంలో భూకబ్జాలకు, సెటిల్ మెంట్లకు పాల్పడుతున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ తమకు వద్దంటూ అధిష్టానాన్ని సదరు నాయకులు కోరారు. సొంత నేతలనూ ప్రొత్సహిస్తూ ఉద్యమకారులను అవమానిస్తున్నారంటూ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై ఆరోపణలు చేశారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..