
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపల్ శివారులో ఉన్న లచ్యా తండాలో 250 మంది ఓటర్లు ఉన్నారు. నిత్యం వీరంతా కలిసి మెలసి వ్యవసాయ పనులు చేసుకుంటారు. కాని ఎన్నికల సమయంలో మాత్రం వీరు విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంంటే ఈ లచ్యాతండ మధ్యలో ఉన్న సీసీ రోడ్డు వీరిని రెండు ముక్కాలుగా చేసింది.. తండా ఒకవైపు మహబూబాబాద్ జిల్లా.. మరోవైపు ఖమ్మం జిల్లాలో కలిసిపోయింది. లచ్య తండాలోని ప్రధాన రహదారికి ఓ వైపున మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లు ఉంటే.. మరోవైపు బర్లగూడెం గ్రామపంచాయతీ ఓటర్లుగా రికార్డులో ఉన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్నన్నా.. పేరుకు మాత్రం వారంతా లచ్యతండా వాసులే.
అయితే ఇక్కడ ఎన్నికల వచ్చాయంటే చాలు వీరు మహబూబాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా వాసులుగా విడిపోతారు.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో అక్కడ తాజాగా మరోసారి ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు డోర్నకల్ మునిసిపల్ పరిధి ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే లచ్యతండాలో మొత్తం 250 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 160 మంది ఓటర్లు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నారు.. 90మంది ఓటర్లు లచ్యతండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నారు. దీంతో లచ్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని వారంతా డిసెంబర్ 14న నిర్వహించనున్న రెండో విడత ఎన్నికల్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోనున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లంతా నిరాశతో ఉన్నారు.
ఈ వింత పరిస్థితి పై రెండు జిల్లాల ప్రజలు చర్చించుకుంటున్నారు. లచ్చతండాలో ఉన్న 250 మంది ఓటర్లు రె౦డుగా విడిపోవడంతో ఓటర్ల సంఖ్య తగ్గి ఎన్నికల సమయంలో వీరిని ఏ పార్టీ వారు పట్టించుకోవడం లేదు. దీంతో అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కూడా లచ్యతండాను ఖమ్మం జిల్లాలో కలిపి ఒక గ్రామపంచాయతీగా ఏర్పాటు చెయ్యాలని అధికారులకు ప్రజాప్రతినిధులు మోరపెట్టుకున్నారు. కానీ అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా స్పందించి లచ్య తండాను ఒకే గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలనీ తండా వాసులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.