Hyderabad: మీ పిల్లలు రాత్రుళ్లు ఎక్కడికి వెళ్తున్నారో గమనించండి.. అలా చేస్తే పేరెంట్స్ జైలుకే..

| Edited By: Srikar T

Jun 22, 2024 | 8:30 PM

బైక్ రేసింగులకు పాల్పడే ఆకతాయులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు. రాత్రివేళ్లలో ఐటీ కారిడార్లపై.. రేసింగ్స్ చేస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. హైస్పీడ్, జిగ్ జాగ్ డ్రైవింగ్, రేసింగ్స్, భారీ శబ్ధకాలుష్యంతో కటింగ్స్ ఇస్తే.. జైల్లో వేస్తామని మాదాపూర్‌ ఏసీపీ సీహెచ్‌.శ్రీకాంత్‌ తెలిపారు.

Hyderabad: మీ పిల్లలు రాత్రుళ్లు ఎక్కడికి వెళ్తున్నారో గమనించండి.. అలా చేస్తే పేరెంట్స్ జైలుకే..
bike racing
Follow us on

బైక్ రేసింగులకు పాల్పడే ఆకతాయులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు. రాత్రివేళ్లలో ఐటీ కారిడార్లపై.. రేసింగ్స్ చేస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. హైస్పీడ్, జిగ్ జాగ్ డ్రైవింగ్, రేసింగ్స్, భారీ శబ్ధకాలుష్యంతో కటింగ్స్ ఇస్తే.. జైల్లో వేస్తామని మాదాపూర్‌ ఏసీపీ సీహెచ్‌.శ్రీకాంత్‌ తెలిపారు. వారి వలన సామన్యుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని.. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. కొందరు యువత రేసింగ్ కల్చర్‌కి అలవాటు పడ్డారని.. రాత్రిళ్లు 12 దాటాక గ్రూపులగా ఏర్పడి రేసింగ్స్ చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాలెడ్జి సిటీ ఐటీ కారిడార్‌ టీ-హాబ్‌ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. తనిఖీల్లో 89 మంది బైక్‌రేసర్లను గుర్తించి వారిని అదుసులోకి తీసుకొని 89 బైక్‌లు, రెండు కార్లు సీజ్‌ చేశామని ఏసీపీ తెలిపారు. ముఖ్యంగా మైనర్లకు బైక్ డ్రైవ్ చేయడమే తప్పని.. వారు కానీ బైక్ సంట్స్ చేస్తూ.. రేసింగ్స్‌కు పాల్పడుతూ పట్టుబడితే వారితో పాటు తల్లిదండ్రులపై కూడా క్రిమినల్‌ కేసులు పెడతామని.. మాదాపూర్‌ ఏసీపీ వార్నింగ్ ఇచ్చారు. కాగా నెక్లెస్‌రోడ్డులో జరుగుతున్న రేసింగ్‌ల కారణంగా ఆ ప్రాంతానికి వెళ్లాలంటనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రేసింగ్‌ల్లో పాల్గొంటున్న వారంతా గ్రూపుగా ఉంటూ సోషల్ మీడియాలో నిరంతరం చాటింగ్‌లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే పోలీసులు ఆ దిశగా కూడా ఫోకస్ పెడితే బాగుంటుందని నగరవాసులు చర్చించుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..