Kamareddy: గంజాయి పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు.. అక్కడ కనిపించింది చూసి షాక్

గంజాయి కోసం వెళ్తే నాటు తుపాకులు పట్టుబడ్డాయ్‌. పోలీసులకే షాకిచ్చిన ఈ ఇన్సిడెంట్‌ తెలంగాణలో జరిగింది.

Kamareddy: గంజాయి పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు.. అక్కడ కనిపించింది చూసి షాక్
Police Raids

Updated on: Dec 01, 2022 | 8:12 AM

కామారెడ్డి జిల్లాలో నాటు తుపాకులు కలకలం రేపాయి. గంజాయి బ్యాచ్‌ను పట్టుకునేందుకు వెళ్తే నాటు తుపాకులు దొరికాయ్‌. నిజాంసాగర్‌ మండలం సింగీతంలో రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారంతో సింగీతం గ్రామంలో దాడులు చేశారు ఎక్సైజ్‌ సిబ్బంది. ఓ ఇంటి మిద్దెపైనా, ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలను గుర్తించిన పోలీసులు, చుట్టుపక్కల పరిసరాలను గాలించడంతో రెండు నాటు తుపాకులు దొరికాయ్‌.

నిందితుడు చటాన్‌సింగ్‌ ఇంటి వెనక ముళ్ల పొదల్లో వీటిని గుర్తించారు పోలీసులు. నిందితుడిపై ఆర్మ్స్ యాక్ట్‌ కింద కేసులు నమోదుచేసి రిమాండ్‌కి తరలించారు. సింగీతం అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడుతున్నట్లు వెల్లడించారు పోలీసులు. చాలాకాలంగా అడవి జంతువుల వేట సాగుతోందంటున్నారు బాన్సువాట డీఎస్పీ జగన్నాథరెడ్డి.  ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..