
‘గోబ్యాక్ మార్వాడీస్’. ఈ నినాదం వినిపించినంత మాత్రాన సరిపోదు. పర్టిక్యులర్‌గా ఎందుకు వెళ్లిపొమ్మంటున్నారో చెప్పాలి. ఈ దేశంలోని ఎవరైనా, ఎక్కడైనా జీవించే హక్కు ఉంది. రాజ్యాంగం అందరికీ కల్పించిన హక్కు అది. ఏ ఒక్కరికో, ఏ కొందరికో ఇబ్బందిగా ఉందని.. ఏకంగా ఒక కమ్యూనిటీనే రాష్ట్రం నుంచి వెళ్లిపొమ్మనే అధికారం, హక్కు ఎవరికీ కట్టబెట్టలేదు రాజ్యాంగం. ‘గోబ్యాక్ మార్వాడీ’ స్లోగన్ వెనక ఆమనగల్లు వ్యాపారులు ఎటువంటి కారణాలు చూపించినా సరే.. అది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం అంటున్నారు. ఇంతకీ ఏం కారణం చెబుతున్నారు ‘గోబ్యాక్ మార్వాడీస్’ వాదులు. వాళ్ల డిమాండ్లు, చెప్పే రీజన్స్ కరెక్టేనా? మార్వాడీలపై తెలంగాణలోని స్థానిక వ్యాపారులకు ఎందుకంత కోపం? ఈ ఆగ్రహం ఆమనగల్లు లాంటి ఒక ప్రాంతానికే పరిమితమా? రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందా? ఇప్పటికిప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టం. కాకపోతే.. కామన్‌గా ఓ వాదన వినిపిస్తోంది. ఈ మార్వాడీల వ్యాపారాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిరు వ్యాపారులు నష్టపోతున్నారనేదే ప్రస్తుత ఆందోళనకు కారణం. ఎక్కడి నుంచో వచ్చిన మార్వాడీల వల్ల.. పల్లె వ్యాపారులు దెబ్బతింటున్నారా? ఎలా? ఆమనగల్లు వర్తక వ్యాపారులు కొన్ని విషయాలు చెబుతున్నారు. ఆమనగల్లు పరిసరాల్లో జరుగుతున్నదే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోంది అనేది వాళ్ల వాదన. కష్టంతో, తెలివితో ఎవరితోనైనా పోటీపడతాం గానీ.. సొంత ఊరోళ్లను మార్వాడీలలాగా మోసం చేయలేం అనే పెద్ద స్టేట్‌మెంట్ ఇస్తున్నారు స్థానిక వర్తకులు. ఇంత తీవ్రమైన మాట ఎందుకు అనాల్సి...