మందు బాబులకు ముఖ్య గమనిక.. ! ఆ మూడు రోజులు వైన్‌షాపులు, బార్లు బంద్‌..!

|

Nov 04, 2023 | 3:52 PM

నవంబర్ 30న జరిగే ఎన్నికలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ నవంబర్ 3 న శుక్రవారం ప్రారంభమైంది. ఎన్నికల ప్రతి దశకు సంబంధించిన టైమ్‌టేబుల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసింది. నామినేషన్లను స్వీకరించే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్‌ఓలు) పేర్లతో కూడిన ఫారం-1లో పబ్లిక్ నోటీసును ప్రతి నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారులు (ఆర్‌ఓలు) విడుదల చేశారు. RO కార్యాలయం నామినేషన్లను స్వీకరించడానికి కేంద్రంగా ఉంటుంది.

మందు బాబులకు ముఖ్య గమనిక.. ! ఆ మూడు రోజులు వైన్‌షాపులు, బార్లు బంద్‌..!
Wines
Follow us on

తెలంగాణలో మందుబాబులకు ముఖ్య గమనిక.. ఈ నెలాఖరులో వరుసగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది.. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. రాజకీయ నాయకులు, అభ్యర్థులు భారీ ర్యాలీలు, సభలు,విస్తృత ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కారణంగా నవంబర్ 28 నుండి 30 వరకు రెస్టారెంట్లు, పబ్బులు, వైన్ దుకాణాలు, బార్‌లతో సహా అన్ని మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.. నవంబర్ 28 నుండి సాయంత్రం 5 గంటల వరకు నవంబర్ 30 న ఓటింగ్ ముగిసే వరకు ఇలాంటి అన్ని షాప్స్‌కి షాట్టర్స్‌ క్లోజ్‌ చేసే ఉంటాయి. అదనంగా డిసెంబర్ ఓట్ల లెక్కింపు రోజున, వ్యాపారాలు మూసివేస్తారు.. ఓటింగ్‌ కేంద్రాల్లో మద్యం, ఇతర మాదక ద్రవ్యాల విక్రయాలపై 48 గంటల పూర్తి నిషేధంతోపాటు అవసరమైన ప్రక్రియలను చేపట్టాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది.

నవంబర్ 3 న గెజిట్ ప్రకటన వెలువడడంతో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలో నవంబర్ 30 న ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 119 మంది సభ్యుల అసెంబ్లీకి నవంబర్ 30న జరిగే ఎన్నికలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ నవంబర్ 3 న శుక్రవారం ప్రారంభమైంది. ఎన్నికల ప్రతి దశకు సంబంధించిన టైమ్‌టేబుల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసింది. నామినేషన్లను స్వీకరించే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్‌ఓలు) పేర్లతో కూడిన ఫారం-1లో పబ్లిక్ నోటీసును ప్రతి నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారులు (ఆర్‌ఓలు) విడుదల చేశారు. RO కార్యాలయం నామినేషన్లను స్వీకరించడానికి కేంద్రంగా ఉంటుంది.

ఇకపోతే, ఓటింగ్ ప్రదేశాల్లో మద్యం, ఇతర మాదకద్రవ్యాల అమ్మకాలపై 48 గంటల పూర్తి నిషేధాన్ని అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం సంబంధిత అధికారులను ఆదేశించింది. వైన్ దుకాణాలు, బార్‌లు, రెస్టారెంట్లు, పబ్బులు వంటి అన్ని మద్య పానీయాల సంస్థలు నవంబర్ 28న సాయంత్రం 5 గంటల నుండి నవంబర్ 30న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటింగ్ ముగిసే వరకు మూసివేయాలని ఆదేశించింది. అదనంగా, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు డిసెంబర్ 3న సంబంధిత అన్ని వ్యాపారాలు మూసివేయాలని ఈసీఐ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..