Telangana: మందుబాబులకు అలర్ట్.. రేపు మద్యం దుకాణాలు బంద్‌! సీపీ సీరియస్‌ వార్నింగ్‌

|

Jun 03, 2024 | 4:54 PM

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా మంగళవారం (జూన్‌ 4) లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రేపు ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు సైబరాబాద్‌ కమిషనరేట్‌ ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. మంగళవారం హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు మూసివేయాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మొహంతి ఆదేశాలు జారీ చేశారు. జూన్‌ 4న ఉదయం 6 గంటల నుంచి..

Telangana: మందుబాబులకు అలర్ట్.. రేపు మద్యం దుకాణాలు బంద్‌! సీపీ సీరియస్‌ వార్నింగ్‌
Liquor Shops
Follow us on

హైదరాబాద్‌, జూన్‌ 3: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా మంగళవారం (జూన్‌ 4) లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రేపు ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు సైబరాబాద్‌ కమిషనరేట్‌ ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. మంగళవారం హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు మూసివేయాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మొహంతి ఆదేశాలు జారీ చేశారు. జూన్‌ 4న ఉదయం 6 గంటల నుంచి జూన్‌ 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు నగరంలోని మద్యం దుకాణాలు, బార్‌లు, రెస్టారెంట్‌లు మూసివేయాలని ఆదేశించారు. అలాగే ఈ సమయంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఎవరైన అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అలాగే కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించడంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడడం, సమావేశాలు, ర్యాలీలపై కూడా జూన్ 5 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, సురక్షితంగా జరిగేలా చూడడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంతర సంఘటనలు జరగకుండా నిరోధించడానికి భారీ సంఖ్యలో పోలీసులను మోహరింపజేస్తున్నారు.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 13న లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్లను జూన్‌ 4న లెక్కించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి ఎన్నికల సంఘం జారీ చేసిన పాసులు ఉన్న సిబ్బంది, ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థుల ఏజెంట్లు, మీడియా ప్రతినిధులకుమమాత్రమే అనుమతి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.