మారుతోన్న అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీ రోజురోజుకీ మారుతోంది. మన అవసరాలను తీర్చేలా టెక్నాలజీలో వస్తున్న మార్పులు ఆశ్చర్యపడేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న బస్సు అందరినీ దృష్టిని ఆకర్షించింది. ఇందులోని అధునాతన టెక్నాలజీ చూసిన వారు ఔరా అంటున్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది డిసెంబర్‌లో ప్రమాదవశాత్తు కాలుజారి పడ్డ విషయం తెలిసిందే. ఈ సమయంలో కేసీఆర్‌కు వైద్యులు హిప్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్స చేశారు. దీంతో కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా బస్సు యాత్రను ప్రారంభించారు.
Modified Bus with a lift: BRS Chief KCR entry in a road show in Suryapet
KCR underwent hip replacement surgery after he accidentally slipped and fell at his home last December.
He is participating in a bus yatra as part of the Lok Sabha polls campaign.#Telangana… pic.twitter.com/qxSoMTrpE1
— Sudhakar Udumula (@sudhakarudumula) April 26, 2024
ఇదిలా ఉంటే ప్రస్తుతం కేసీఆర్ యాత్రకు ఉపయోగిస్తున్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం ఇందులోని టెక్నాలజీనే. కేసీఆర్‌కు జరిగిన ప్రమాదం నేపథ్యంలో మెట్లు ఎక్కడం ఇబ్బందిగా మారింది. దీంతో ఏకంగా బస్సులో లిఫ్ట్‌నే ఏర్పాటు చేశారు. ప్రజలు ఉద్దేశించి మాట్లాడానికి సహజంగా బస్సు టాప్ పైకి వెళ్తుంటారు. ఇందుకోసం బస్సులో మెట్లు ఉంటాయి. అయితే కేసీఆర్ కోసం ప్రత్యేకంగా బస్సులో ఏకంగా లిఫ్ట్‌నే ఏర్పాటు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..