కరోనా వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందా? అంటే అవుననే అంటున్నాయి తెలంగాణ వైద్య వర్గాలు. అందుకు ఆధారంగా కేంద్రం వివిధ రాష్ట్రాలకు ఇప్పటివరకూ కేటాయించిన వ్యాక్సిన్ లెక్కలు చూపిస్తున్నారు. 2021 జనవరి 16న దేశవ్యాప్తంగా మొదలైన కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటివరకూ సరఫరా అయిన వ్యాక్సిన్‌లో 60 శాతం పైగా కేవలం 9 రాష్ట్రాలకే కేటాయించడం గమనార్హం. ఇందులో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉండగా, తరువాతి స్థానాలలో రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. ఇందులో మహారాష్ట్ర, రాజస్థాన్ లను మినహాయిస్తే మిగిలినవి అన్నీ… బీజేపీ పాలిత రాష్ట్రాలు లేదా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు అని నిపుణులు చెబుతున్నారు.
జనవరి 16 నుంచి ఇప్పటివరకూ కేంద్రం అన్ని రాష్ట్రాలకూ సరఫరా చేసిన వ్యాక్సిన్లు దాదాపు 12 కోట్లు
13-04-2021 ఉదయం వరకూ దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ వేయించుకున్నవారి సంఖ్య 10,85,33,085
1. మహారాష్ట్ర 1,05,29,376
2. రాజస్థాన్ 99,25,581
3. గుజరాత్ 94,98,866
4. ఉత్తరప్రదేశ్ 93,59,564
5. పశ్చిమబెంగాల్ 82,26,026
6. కర్ణాటక 64,07,325
7. మధ్యప్రదేశ్ 62,47,108
8. కేరళ 50,98,184
9. బీహార్ 49,54,731
10.ఛత్తీస్‌ఘడ్ 44,62,959
…………………………………………
1. ఆంధ్రప్రదేశ్ 39,13,719
2. తెలంగాణ 22,92,129
తెలంగాణ కంటే చిన్న రాష్ట్రమైన ఛత్తీస్‌ఘడ్ కు కూడా తెలంగాణ కంటే రెట్టింపు వ్యాక్సిన్ సరఫరా చేయడం విశేషం.
ఈ చెట్లు, మొక్కలు చాలా ప్రమాదకరమైనవి… టచ్ చేసినా చాలు ప్రాణాలు తీసేస్తాయి..