Weather Report: పొంచి ఉన్న మరో అల్పపీడనం.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

తెలుగురాష్ట్రాలకు భారత వాతావరణ కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంగా బలహీన పడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లోని రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. కాబట్టి ఏ జిల్లాల్లో వర్షాలు ఎలా ఉంటాయో చూద్దాం.

Weather Report: పొంచి ఉన్న మరో అల్పపీడనం.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Latest Weather Report For Ap And Telangana (1)

Updated on: Oct 29, 2026 | 5:30 PM

దక్షిణ ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశాపైగా ఉన్న వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తరం వైపు ప్రయాణించి.. ఉత్తర ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య ఒడిశాపై బలహీనపడి సుస్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని.. అలాగే దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం అదే చోట కొనసాగుతోందని.. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, రాబోయే 24 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో సుస్పష్ట అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

అలాగే దక్షిణ ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా మీదుగా ఉన్న అల్పపీడన కేంద్రం నుండి తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ కొంకణ్‌లోని ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి విస్తరించి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉందని. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

కోస్తా ఆంధ్రప్రదేశ్ ,యానాం, రాయల సీమలో వాతావరణం

అల్పపీడనం ప్రభావంతో గురువారం ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. అలాగే శుక్ర, శనివారాల్లో ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల కురుస్తాయని.. వర్షాల సమయంలో బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు గరిష్టముగా 50 కిలోమీటర్ల వేగముతో వీస్తాయని అంచనా వేసింది. ఇక రాయలసమీలోని జిల్లాల్లో కూడా రాబోయే మూడు రోజులు వాతావరణం ఇలానే ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో వాతావరణం ఇలా

అల్పపీడనం ప్రభావం ఇటు తెలంగాణపై కూడా ఉంటుందని భారత వాతవరణ కేంద్ర స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరి కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండొచ్చని తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us