Hyderabad: ల్యాండ్‌మార్క్ హోటల్‌ యజమాని కుటుంబం ఆత్మహత్య.. కీలకంగా మారిన సూసైడ్ నోట్‌..!

హైదరాబాద్ మహానగరం అంబర్‌పేట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ల్యాండ్‌మార్క్ హోటల్‌ యజమాని కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మృతులను రామ్‌రాజ్‌, మాధవి, శశాంక్‌గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: ల్యాండ్‌మార్క్ హోటల్‌ యజమాని కుటుంబం ఆత్మహత్య.. కీలకంగా మారిన సూసైడ్ నోట్‌..!
Landmark Hotel Owner's Family Suicide

Updated on: Feb 24, 2026 | 2:03 PM

హైదరాబాద్ మహానగరం అంబర్‌పేట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ల్యాండ్‌మార్క్ హోటల్‌ యజమాని కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మృతులను రామ్‌రాజ్‌, మాధవి, శశాంక్‌గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో ల్యాండ్‌మార్క్ హోటల్‌ యజమాని రామ్‌రాజ్ అంబర్‌పేట్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ముందు భార్య మాధవిని చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, రామ్‌రాజ్‌ కుమారుడు శశాంక్‌ చేయికోసుకుని సూసైడ్‌ చేసుకున్నాడు. ఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్టు రామ్‌రాజ్‌ సూసైడ్‌ నోట్‌ రాసినట్లు పోలీసులు తెలిపారు. తన ఆస్తులు మొత్తం తన కూతురికేనంటూ వీలునామా కూడా రాసినట్లు సమాచారం. ప్రస్తుతం రామ్‌రాజ్‌ కూతురు అమూల్య కొంపల్లిలో ఉంటున్నట్లు తెలుస్తోంది.

సూసైడ్‌ నోట్ ఆధారంగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రామ్‌రాజ్‌ కూతురు ఏదైనా కోణంలో అనుమానం వ్యక్తం చేస్తే, ఆ దిశగా కూడా విచారణణ చేస్తామని చెప్పారు. ఇదిలావుంటే, ల్యాండ్‌మార్క్ హోటల్‌ యజమాని కుటుంబం మృతిపై రామ్‌‌రాజ్‌ అన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు పెద్ద సమస్య కాదని, తమది వెల్‌ సెటిల్డ్ కుటుంబం అని చెప్పారు. సూసైడ్ ఎందుకు చేసుకున్నారో.. అసలు ఏం జరిగిందో తెలియడం లేదని అనుమానం వ్యక్తం చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us