Telangana: ట్యాలెంట్‌ ఉన్నా కలిసిరాని అదృష్టం.. పతకాలు గెలిచినా హోటల్లో సర్వర్‌గా

ఇప్పటివరకు తమిళనాడు, జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో నాలుగు మెడల్స్ లో ఒకటి వెండి ,మూడు రజితం రాష్ట్రస్థాయిలో 20 బంగారు పతకాలను గెలుచుకుంది మార్చి నెలలో భద్రాచలంలో జరిగిన ఆరు జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ 57 కిలోల విభాగంలోనూ స్వర్ణం సాధించింది. జాతీయస్థాయిలో తన ప్రతిభ ప్రదర్శించేందుకు...

Telangana: ట్యాలెంట్‌ ఉన్నా కలిసిరాని అదృష్టం.. పతకాలు గెలిచినా హోటల్లో సర్వర్‌గా
Telangana

Edited By:

Updated on: Dec 01, 2024 | 7:58 PM

పేద కుటుంబంలో పుట్టి అనేక కష్టాలు ,ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని వెయిట్ లిఫ్టింగ్ లో ప్రతిభ కనబరిచి అనేక మెడల్స్ సాధించింది ఆ యువతి.. కానీ నిజ జీవితంలో మాత్రం కడు పేదరికంతో ఎవరి ప్రోత్సహం లేక పోవడంతో ఓ హోటల్ లో సర్వర్ గా పని చేస్తోంది కుమారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కూలి పనులు చేస్తూ జీవించే బండి మల్లయ్య రాజమ్మ దంపతుల ఏకైక కుమార్తె కుమారి వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉన్న పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రాణిస్తోంది.

ఇప్పటివరకు తమిళనాడు, జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో నాలుగు మెడల్స్ లో ఒకటి వెండి ,మూడు రజితం రాష్ట్రస్థాయిలో 20 బంగారు పతకాలను గెలుచుకుంది మార్చి నెలలో భద్రాచలంలో జరిగిన ఆరు జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ 57 కిలోల విభాగంలోనూ స్వర్ణం సాధించింది. జాతీయస్థాయిలో తన ప్రతిభ ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది గత నెల 19న హైదరాబాదులో తెలంగాణ జోనల్ స్పోర్ట్స్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 57 కిలోల విభాగంలో ఇల్లందుకు చెందిన కుమారి సత్తా చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.

నవంబర్ 8 నుంచి 10 వరకు ఢిల్లీలో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 57 కిలోల విభాగంలో ఆమె పాల్గొంది. నిరుపేద కుటుంబంలో పుట్టి నేషనల్ స్థాయి వరకు ఎదిగిన కుమారి ప్రేమ వివాహం చేసుకుంది ఆమెకు ఒక కూతురు పేదరికాన్ని వెక్కిరిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వదిలి వెళ్లిపోయాడు. దీంతో కూతురి పోషణ కోసం నేడు..హోటల్లో సర్వర్ గా పని చేస్తుంది.

 

నేషనల్ స్థాయికి సెలెక్ట్ అయిన స్పాన్సర్స్ దొరక్క దిక్కు తోచని స్థితిలో హోటల్లో చేసుకుని జీవనం కొనసాగిస్తుంది. ఇప్పటికే 40 పథకాలకు పైగా సాధించిన కుమారికి పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఆటంకంగా మారాయి. తన పేదరిక జీవనాన్ని, ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతోంది కుమారి. ప్రభుత్వం, స్పాన్సర్లు ప్రోత్సహిస్తే పవర్ లిఫ్టింగ్ లో నేషనల్ లెవెల్ లో కూడా పథకాలు సాధిస్తానని చెబుతోంది.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..