Kukatapally: కూకట్‌పల్లి సహస్ర మర్డర్‌ కేసులో వీడిన మిస్టరీ.. చంపింది ఎవరంటే..?

కూకట్‌పల్లి సహస్ర మర్డర్‌ కేసు మిస్టరీ ఇప్పుడు వీడింది. సాయి అనే పదో తరగతి విద్యార్థి బాలికను హత్య చేసినట్లు అంగీకరించాడు. అతను హత్య జరిగిన రోజు అక్కడ సంచరించినట్లు స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ దిశగా పోలీసులు విచారణ జరిపి కేసు చేధించారు.

Kukatapally:  కూకట్‌పల్లి సహస్ర మర్డర్‌ కేసులో వీడిన మిస్టరీ.. చంపింది ఎవరంటే..?
Sahasra Case Solved

Updated on: Aug 22, 2025 | 4:56 PM

హైదరాబాద్ కూకట్‌పల్లిలోని బాలిక హత్యకేసులో మిస్టరీ వీడింది.  సాయి అనే టీనేజర్ పనిగా తేల్చారు పోలీసులు. సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చాడు సదరు టీనేజర్. వచ్చేటప్పుడే కత్తి తెచ్చుకున్నాడు. ఇంట్లోకి చొరబడి 80వేలు దొంగతనం చేశాడు. డబ్బు తీసుకుని వెళ్తుండగా సహస్ర చూసింది. దీంతో ఆమెపై కూర్చుని గొంతు నులిమాడు. చనిపోయిందో లేదోనని ఆ తర్వాత గొంతు కోశాడు.  ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా కత్తితో పొడిచాడు.  దొంగతనం ఎలా చెయ్యాలి, అడ్డొస్తే ఏం చేయాలో కూడా సదరు టీనేజర్ ఓ ప్లాన్ రాసి పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

Accused Plan

సాయి.. బాలికను అత్యంత దారుణంగా హత్య చేశాడు. సహస్ర మర్డర్‌ జరిగిన రోజు సాయిని అక్కడ సంచరించినట్లు స్థానికులు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. మర్డర్ మిస్టరీని చేధించారు.  స్థానికులు చెప్పిన సమాచారంతో కేసును చేధించిన పోలీసులు. పోలీసుల విచారణలో తొలుత సాయి పొంతనలేని సమాధానాలు చెప్పాడు.  క్రికెట్‌ ఆడేందుకు
సహస్ర తమ్ముడి కోసమే ఇంటికి వచ్చినట్టు పోలీసులను మాయ చేయాలని చూశాడు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో.. నేరాన్ని అంగీకరించాడు.

హత్యకు గురైంది పదేళ్ల పాప. చంపింది పదోతరగతి కుర్రాడు. 15ఏళ్ల వయసులోనే క్రిమినల్ బ్రెయిన్‌ ఆ బాలుడిలో కనిపిస్తోంది. దొంగతనానికి స్కెచ్ వేయడం, ఇంట్లో ఎవరూ లేని సమయంపై ఆరా తీయడం, ఎవరికి కనపడకుండా ఇంట్లోకి ఎలా వెళ్లాలి అనేది లెక్కలు వేయడం, ఒకవేళ ఎవరైనా చూస్తే ఏం చేయాలో కూడా ముందే ఫిక్స్ అవ్వడం, వెళ్తూ వెళ్తూ కత్తి తీసుకెళ్లడం, ఒకవేళ దొంగతనమే కాకుండా.. మర్డర్ చేయాల్సి వస్తే కూడా ఎలా చెయ్యాలో ప్లాన్ గీసుకోవడం, మర్డర్ తర్వాత కత్తి లాంటివి ఎలా పడేయాలో కూడా ముందే అనుకోవడం.. ఒకటా రెండా 15ఏళ్ల వయసులోనే ఇంత భారీ స్కెచ్‌.

ఒకటీ రెండు రోజులు కాదు.. 5రోజుల పాటు మిస్టరీగా ఉన్న కేస్‌ ఇది. ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ లేదు. పక్కా సాక్ష్యాల్లేవ్‌. అనుమానాల చుట్టూ అల్లుకున్న కేస్ ఇది. ఎక్కడో చిన్న క్లూ.. ఓ బాలుడు ఆ ఇంటి పరిసరాల్లో తచ్చాడాడు అని. దాన్ని లోతుగా దర్యాప్తు చేస్తూ వెళ్తే వీడిన మిస్టరీ ఇది.