KTR: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై కేటీఆర్ రియాక్షన్ ఇదే..

ఎక్సైజ్ పాలసీ సంబంధిత మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21 రాత్రి అరెస్టు చేసింది. కేజ్రీవాల్ కు రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొద్ది గంటల్లోనే ఈ అరెస్టు జరగడం గమనార్హం. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 55 ఏళ్ల ఈ నేతను అరెస్టు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆగ్రహం వ్యక్తం చేసింది.

KTR: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై కేటీఆర్ రియాక్షన్ ఇదే..
KTR

Updated on: Mar 22, 2024 | 7:46 AM

ఎక్సైజ్ పాలసీ సంబంధిత మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21 రాత్రి అరెస్టు చేసింది. కేజ్రీవాల్ కు రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొద్ది గంటల్లోనే ఈ అరెస్టు జరగడం గమనార్హం. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 55 ఏళ్ల ఈ నేతను అరెస్టు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆగ్రహం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆ పార్టీ తెలిపింది. అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతానన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.

బీజేపీకి చెందిన విపక్ష నేతలు కేజ్రీవాల్ కు మద్దతు తెలపడంతో పాటు అరెస్టును ఖండించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, నేషనలిస్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు శరద్ పవార్, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రదాద్ యాదవ్ నుంచి సీపీఎం పార్టీ వరకు ఇతర నేతలు  ఖండించారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. కేజ్రీవాల్ అరెస్ట్ ను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది అక్రమ అరెస్ట్ అని, ఈడీ, సిబిఐ బిజెపి చేతిలో అణచివేతకు ప్రధాన సాధనాలుగా మారాయని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. రాజకీయ ప్రతీకారమే వారి బీజేపీ ఉద్దేశం అని కేటీఆర్ అన్నారు. అయితే కవిత అరెస్ట్ తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.