AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చడీచప్పుడు లేకుండా ఇంట్లోకి దూరిన అజ్ఞాత వ్యక్తి.. ఎవరు నువ్వు అని తల్లికూతుళ్లు అడగ్గా.!

అది గురువారం మధ్యాహ్న సమయం. బేగంపేటలోని ఓ ఇంట్లో తల్లికూతుళ్లిద్దరూ ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. ఈలోగా బయట నుంచి ఏదో శబ్దం వచ్చింది. వచ్చింది ఎవరై ఉంటారని బయటకు వెళ్లి చూడగా.. తల్లీకూతుళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంట్లోకి ఓ ఆగంతకుడు తలకు హెల్మెట్ పెట్టుకుని.. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దామా

Ravi Kiran
|

Updated on: Mar 22, 2024 | 7:07 AM

Share

హైదరాబాద్‌ బేగంపేటలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. గన్‌తో ఇంట్లోకి చొరబడిన అగంతకులతో తల్లీకూతురు విరోచితంగా పోరాడారు. దొంగల్ని తరిమితరిమికొట్టారు. తుపాకీతో ఇంట్లోకి చొరబడిన అగంతకులతో విరోచితంగా పోరాడి బడిత పూజ చేశారు తల్లీకూతుర్లు. తుపాకీ, కత్తులతో ఇంట్లోకి ప్రవేశించి.. బెదిరించినా బెదరకుండా దొంగల భరతం పట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బేగంపేటలో జరిగింది. మాస్క్‌, హెలిమెంట్, చేతితో కత్తి, తుపాకీతో ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దొంగలు తల్లీకూతుర్ని బెదిరించి.. బంగారం, నగదు కొట్టేయ్యాలని ప్లాన్ చేశారు. గన్‌తో బెదిరింపులకు పాల్పడినా ఏమాత్రం బెదరకుండా దుండగుడితో విరోచితంగా పోరాటం చేసి.. జుట్టుపట్టుకొని ఒక దొంగను ఇంటిబయట ఈడ్చిపడేసింది. అతని దగ్గర తుపాకీ లాక్కోని చితకొట్టింది. తల్లికితోడుగా కూతురు కూడా దొంగపై దాడి చేయడంతో పరుగు తీశారు. తర్వాత ఇంట్లో ఉన్న మరో దొంగను కూడా పరిగెత్తించి కొట్టారు తల్లికూతుళ్లు.

ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు యూపీకి చెందిన వారిగా గుర్తించారు. గతంలో దీపావళి టైంలో జైన్ ఇంట్లో క్లీనింగ్ కోసం వచ్చారని చెబుతున్నారు ఆర్‌కే జైన్ భార్య. ఇంటి గుట్టు తెలుసుకొని సంవత్సరం తర్వాత దొంగతనానికి ప్లాన్ వేశారని పోలీసులు చెప్పారు. నిందితులనుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఆర్ కే జైన్ మేడ్చల్ లో ఓ పరిశ్రమ నడుపుతున్నారు. మరోవైపు తల్లీకూతురు దుండగుడితో పోరాడిన వీడియో సోషల్ మీడియాలోను వైరల్‌గా మారింది.

Follow Us
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి