KTR: ఆడిట్‌ రిపోర్టులే శ్వేత పత్రాలు.. రాహుల్‌ మాట ఇప్పుడు ఎక్కడికి పోయింది..? కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

|

Dec 13, 2023 | 2:49 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముందే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం మొదలైంది. శాఖలవారీగా శ్వేతపత్రాల విడుదలకు కాంగ్రెస్‌ యాక్షన్‌ప్లాన్‌ రెడీ చేసుకుంటోంది. ఈ సమయంలో కాంగ్రెస్‌ శ్వేతపత్రాలపై మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శలు సంధించారు. అసెంబ్లీలోని BRS LP కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన KTR..

KTR: ఆడిట్‌ రిపోర్టులే శ్వేత పత్రాలు.. రాహుల్‌ మాట ఇప్పుడు ఎక్కడికి పోయింది..? కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Rahul Gandhi And KTR
Follow us on

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముందే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం మొదలైంది. శాఖలవారీగా శ్వేతపత్రాల విడుదలకు కాంగ్రెస్‌ యాక్షన్‌ప్లాన్‌ రెడీ చేసుకుంటోంది. ఈ సమయంలో కాంగ్రెస్‌ శ్వేతపత్రాలపై మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శలు సంధించారు. అసెంబ్లీలోని BRS LP కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన KTR.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిఏటా తాము ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ శ్వేతపత్రం కాదా అంటూ కేటీఆర్‌ ప్రశ్నలు సంధించారు. ప్రతి బడ్జెట్‌లో అప్పులపై అసెంబ్లీలో ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీలో పెట్టే ఆడిట్‌ రిపోర్ట్‌లే శ్వేత పత్రాలని.. అంతకుమించిన శ్వేతపత్రం ఉంటుందా అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలు చదవకపోతే తాము ఏం చేస్తామంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హామీలు ఇచ్చినప్పుడు కాంగ్రెస్‌ వాళ్లకు తెలియదా..? లెక్కలు వేసుకోకుండానే హామీలు ఇచ్చారా? అంటూ కేటీఆర్‌ పేర్కొన్నారు. తాము ఉన్నప్పుడు ఉన్న పరపతి ఇప్పుడు ఎక్కడ పోయిందంటూ ప్రశ్నించారు. పరపతి లేకుండా తమకు కూడా అప్పులు పుట్టవు కదా అంటూ చెప్పారు.

రుణమాఫీపై కూడా కేటీఆర్ స్పందించారు. 24 గంటల్లో రుణమాఫీ అని రాహుల్‌ గాంధీ చెప్పారు.. రాహుల్‌ చెప్పిన మాట ఇప్పుడు ఎక్కడికి పోయిందంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..