Telangana: మేనేజ్‌మెంట్‌ కోటాలో ఎన్నికైన సీఎం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్..

మొన్న పార్లమెంట్‌ సెగ్మెంట్లు.. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష. నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ దూకుడుగా వెళ్తోంది గులాబీ పార్టీ. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యకర్తలను కలుస్తూ ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలపై అస్త్రాలు సంధిస్తూ దూసుకెళ్తున్నారు.

Telangana: మేనేజ్‌మెంట్‌ కోటాలో ఎన్నికైన సీఎం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్..
Telangana Politics

Updated on: Jan 28, 2024 | 9:50 PM

మొన్న పార్లమెంట్‌ సెగ్మెంట్లు.. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష. నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ దూకుడుగా వెళ్తోంది గులాబీ పార్టీ. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యకర్తలను కలుస్తూ ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలపై అస్త్రాలు సంధిస్తూ దూసుకెళ్తున్నారు. ఇలా.. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు.. గులాబీ పార్టీకి రెండు కళ్లుగా ఉంటూ లోక్‌సభ ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా నేతలకు దిశానిర్దేశం తర్వాత ఇప్పుడు రోజుకో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు చేస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా మెదక్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌రావు పాల్గొనగా.. సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గ BRS విస్తృత స్థాయి స‌మావేశంంలో కేటీఆర్ పాల్గొని కేడర్ కు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ‌లు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింద‌ని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గ BRS విస్తృత స్థాయి స‌మావేశంంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాలం క‌లిసి వ‌స్తే వాన‌పాములు కూడా నాగుపాములై బుస‌లు కొడుతాయ‌న్నారు. రేవంత్‌రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు.. ఢిల్లీ మేనేజ్‌మెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. మాణిక్‌రావు ఠాగూర్‌కి 50 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్‌.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకంలో బస్సుల సంఖ్య పెంచాలని, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్‌ కంటే బలమైన గొంతు దేశంలోనే లేదని.. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ను తొక్కేయాలని చూస్తున్నాయని.. అది ఎప్పటికీ సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించారు.

మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ కౌంటరిచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని గౌరవించే సంస్కారం లేని వ్యక్తి కేటీఆర్‌ అని మండిపడ్డారు. BRSను వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..