బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గుడ్ లీడర్ మాత్రమే కాదు.. మంచి ఇన్ ఫ్లూయర్ కూడా. రాజకీయాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది ఆయనకు. తాజాగా ఆయన పాఠశాలలకు పిల్లలకు ఇచ్చిన మాట ప్రకారం.. వాళ్లను కలుసుకొని ఆనందపర్చాడు. మూడు రోజుల కింద రాజేంద్రనగర్ లోని మిలీనియం స్కూల్ విద్యార్థులు కొంతమంది ఒక చిన్న వీడియో తయారుచేసి తమ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కేటీఆర్ కి సామాజిక మాధ్యమం ఎక్స్ లో రిక్వెస్ట్ పెట్టారు.
ఆ పోస్ట్ కి స్పందించిన కేటీఆర్ ఇప్పటికే తన షెడ్యూల్లో ఇతర కార్యక్రమాలు ఉన్నా, మీకోసం కొంత సమయం తీసుకుని వస్తాను, మీ ఆహ్వానం అంత బాగా నచ్చింది అంటూ రియాక్ట్ అయ్యారు. ఇప్పటిదాకా తనకు అనేక కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వానాలి అందాయని, కానీ ఇంత అద్భుతంగా ( క్యూట్ గా) ఆహ్వానం అందడం ఇదే అంటూ కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రాజేంద్రనగర్ వెళ్లి మిలీనియం స్కూల్ విద్యార్థులతో గడిపారు.
స్కూల్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్, తనకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన చిన్న పిల్లలతో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడి వెనుతిరిగారు. కేటీఆర్ తమ విద్యార్థులకు కోరికను మన్నించి ఈ కార్యక్రమానికి హాజరు కావడం పట్ల స్కూలు యాజమాన్యంతో పాటు, ఈ కార్యక్రమానికి హాజరైన వందలాదిమంది విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ తో సెల్ఫీలు తీసుకొని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.