
మంత్రాలు, తంత్రాలు, క్షుద్రపూజలు, చేతబడులు లాంటి పూజలేమైనా చేస్తే.. అమావాస్య నాడే ఎక్కువగా చేస్తుంటారు. ఎవ్వరూ చూడని వేళలో అర్ధరాత్రి చిమ్మచీకట్లో చేస్తుంటారు. కానీ మహబూబ్‌నగర్ శివారులో ఉత్తుత్తి నకిలీ మంత్రగాడు ఉన్నట్టుండు.. పట్టపగలే ఈ క్షుద్రపూజలు చేస్తున్నాడు. అదేంటంటే..
వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అప్పనపల్లి శివారులోని అడవిలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఆదివారం రోజున కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, జీడి గింజలతో క్షుద్ర పూజలు చేశాడు ఓ ఉత్తుత్తి పూజారి. ఈ పూజల్లో భాగంగా నాటుకోడిని కూడా బలిచ్చాడు. అటుగా వెళ్లే స్థానికులు.. ఇదంతా ఏంటని అడిగితే.. ఆరోగ్యం బాగోలేదని.. అందుకే ఇదంతా అంటూ ఉత్తుత్తి మాటలు చెప్పారు. ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి వెళ్లాలి గానీ.. ఊరుచివర ఏం చేస్తున్నారోనని అనుమానమొచ్చి ఈ తతంగం అంతటిని వీడియో తీసి పోలీసులకు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షుద్రపూజలను భగ్నం చేశారు. క్షుద్రపూజారితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి.. స్టేషన్‌కి తరలించారు. వరి ముగ్గురు అప్పనపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి