సీఎం రేవంత్ బ్లాక్ మెయిల్ చేశారు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేసే అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. తన బర్తరఫ్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి సోదరులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నారని ఆరోపించారు.

సీఎం రేవంత్ బ్లాక్ మెయిల్ చేశారు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
Konda Surekha And Cm Revanth Reddy

Updated on: Sep 03, 2026 | 4:17 PM

తెలంగాణ మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తున్నారనే విషయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆమెను బర్తరఫ్ చేయడంపై ఇప్పటికే సీఎంఓ నుంచి లోక్ భవన్‌కు సమాచారం కూడా వెళ్లింది. ఆమెను మంత్రి వర్గం నుంచి తప్పిస్తున్నట్లు గవర్నర్ నుంచి అధికారిక ప్రకటన విడుదల లాంఛనంగా మారింది. ఈ క్రమంలో కొండా సురేఖ టీవీ9తో మాట్లాడాతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన కూతురు ఇండిపెండెంట్ అని, ఆమె వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవించాలని, తన కూతురి చేసిన వ్యాఖ్యలతో తనకేం సంబంధం అంటూ ఆమె స్పష్టం చేశారు. తనకు ఏ సమాచారం ఇవ్వకుండా బర్తరఫ్ ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. అలాగే తన బర్తరఫ్ ఒక కుట్ర అని దానీ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నారంటూ ఆమె ఆరోపించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయం చేశారని, తనను మంత్రి పదవి నుంచి తప్పించకుంటే, సీఎం పదవి నుంచి నేను తప్పుకుంటాను అని బెదిరించినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి.

వీడియో చూడండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us